కర్ణాటక సాక్షిగా.. ఒక్కటైన కేసీఆర్, పవన్!

కర్ణాటక సాక్షిగా.. ఒక్కటైన కేసీఆర్, పవన్!
x
Highlights

కర్ణాటక ఎన్నికల సాక్షిగా తెలుగు రాజకీయాల్లో ఓ మార్పు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడతారో తర్వాత సంగతి కానీ.. కాస్త...

కర్ణాటక ఎన్నికల సాక్షిగా తెలుగు రాజకీయాల్లో ఓ మార్పు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడతారో తర్వాత సంగతి కానీ.. కాస్త జాగ్రత్తగా ఆలోచించి చూస్తే.. ఈ మార్పు కొందరిని ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. అదేంటంటే.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఈ మధ్య టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని, జేడీఎస్ నాయకుడు దేవెగౌడను కలిశారు. కలిసి పనిచేద్దామని ఇద్దరూ ఓ నిర్ణయానికి కూడా వచ్చారు.

ఇప్పుడు.. అదే జేడీఎస్ కు పవన్ కల్యాణ్ కూడా మద్దతు ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని మాజీ సీఎం కుమారస్వామి కూడా ధృవీకరించారు. గతంలో కూడా.. ఓ సారి పవన్ ను వ్యక్తిగతంగా కుమార స్వామి కలిసిన సందర్భం ఉంది. ఆ స్నేహమే.. ఇప్పుడు ఈ కలయికకు దారి తీసింది.

సో.. కేసీఆర్, పవన్ కల్యాణ్.. ఈ ఇద్దరూ.. జేడీఎస్ కు ఉమ్మడిగా ప్రచారం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంతే కాక.. కేసీఆర్ కార్యక్రమాలను అద్భుతమంటూ కీర్తించిన గతం కూడా పవన్ కల్యాణ్ వెంట ఉంది.

అందుకే.. ఈ కాంబో.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ, ఏపీలో కూడా కలిసి పని చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories