ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు

ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు
x
Highlights

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ ఒకేదెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న‌చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని...

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ ఒకేదెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న‌చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
నిన్న అనంతపురంలోని గుత్తి రహదారిలో జనసేన పార్టీ కార్యాలయానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం స‌భ‌లో ప్ర‌స‌గించిన ప‌లు అంశాల్ని లేవ‌నెత్తారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఎంత దూర‌మైనా వెళ‌తాన‌న్న ప‌వ‌న్ నేడు మంత్రి ప‌రిటాల సునిత‌తో భేటీ అయ్యారు. పలు స‌మ‌స్య‌ల పై చ‌ర్చ‌లు జ‌రిపిన ఆయ‌న గ‌తంలో ప‌రిటాల కుటుంబానికి - త‌న గురించి వ‌చ్చిన వార్త‌ల‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. గ‌తంలో వ‌చ్చిన వార్త‌ల‌కు త‌న‌కు సంబంధంలేదని , తాను మొద‌టిసారి ప‌రిటాల కుటుంబాన్ని క‌లిసింది అంటూ న‌వ్వుతూ అన్నారు.
అయితే రాజ‌కీయ విశ్లేష‌కులు మాత్రం త‌న పై వ‌చ్చిన రూమ‌ర్ల‌కు చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేశార‌ని అంటున్నారు.గ‌త డిసెంబ‌ర్ లో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని దగ్గర జ‌న‌సేన పార్టీ కార్యాల‌య ప్రాంగ‌ణాన్ని ప‌రిశీలించారు. అనంత‌రం కార్యాలయం నిర్మాణానికి భూములు లీజుకు ఇచ్చిన రైతులకు పవన్ కల్యాణ్ ధన్య‌వాదాలు తెలిపారు.
ఈ సంద‌ర్భంగా దివంగత టీడీపీ నేత పరిటాల రవి తనకు గుండు గీయించారని కొంతమంది టీడీపీ నేతలు ప్రచారం చేశారని, ఆ గుండు తానే కొట్టించుకున్నానని..గుండు గీయించుకున్నారనేది అబద్ధమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వివరణ ఇచ్చారు. అవమానం జరిగితే నేను ఊరుకునేవాడినేనా? అంటూ ప్రశ్నించారు.
ఇప్పుడు అనంత‌పురం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ మంత్రి ప‌రిటాల సునితో భేటీ అవ్వ‌డం స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించి మీడియాతో త‌న‌కు ప‌రిటాల మ‌ధ్య ఎలాంటి మ‌న‌స్ప‌ర్ధ‌లు లేవ‌నే విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పాడు. దీంతో క్రిటిక్స్ అటు పాలిటిక్స్ ..ఇటు రూమ‌ర్ల‌ను చెక్ పెట్టి ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న చందంగా వ్య‌వ‌హ‌రించార‌ని వారు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories