పంచ్ పడింది...పవన్ తాజా వ్యాఖ్యలపై దుమారం

x
Highlights

రాజకీయ నాయకుడికి అందులోనూ, ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపన ఉన్న నాయకుడికి సమాజం పట్ల, చట్ట సభల పట్ల కనీస పరిజ్ఞానం అవసరం వచ్చే ఎన్నికల్లో సొంతంగా...

రాజకీయ నాయకుడికి అందులోనూ, ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపన ఉన్న నాయకుడికి సమాజం పట్ల, చట్ట సభల పట్ల కనీస పరిజ్ఞానం అవసరం వచ్చే ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగాలను కుంటున్న పవన్ కల్యాణ్ అత్యుత్సాహంలో గతి తప్పి మాట్లాడు తున్నారా? ప్రస్తుత రాజకీయాలకు తగిన విధంగా మాట్లాడటంలో పవన్ పరిణతిని కనపరచలేకపోతున్నారా? తాజాగా పవన్ కామెంట్లపై రాజకీయ విశ్లేషకులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా విజయవాడలో మాట్లాడిన మాటలు ఆలోచించి మాట్లాడినట్లుగా లేవనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

తనకు అసెంబ్లీలో పదిమంది ఎంపీలుంటే ప్రభుత్వాన్ని నిలదీసే వాడినని అనడం పొరపాటుగా చేసిన వ్యాఖ్యే అయినా ప్రత్యర్ధి పార్టీలు మాత్రం వదిలిపెట్టడం లేదు అసెంబ్లీలో ఎవరుంటారో కూడా తెలీని స్థితిలో పవన్ ఉన్నారా అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పవన్ పై కౌంటర్లు పడిపోతున్నాయి. ఇక రాజకీయ పార్టీలయితే సరే సరి.

అదే స్పీచ్ లో పవన్ ఇంకా చాలా మాట్లాడారు 2012లో పోటీ చేయాలనుకుననట్లు కానీ పరిస్థితులు సహకరించలేదని వ్యాఖ్యానించారు. 2012లో అసలు ఎన్నికలే జరగలేదు. సార్వత్రిక ఎన్నికలు జరిగినది2014లో ఆ ఎన్నికల్లో పోటీకి ముందు తనకు, చంద్రబాబుకు మధ్య జరిగిన సంభాషణలను కూడా పవన్ బయటపెట్టారు.

తమ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను చంద్రబాబు ఆ తర్వాత పత్రికలకు లీక్ చేసారని మండిపడ్డారు. ఆరోజే చంద్రబాబుపై నమ్మకం పోయి నమస్కారం పెట్టి వెళ్లిపోయానని అన్నారు పవన్. ఒకప్పుడు టిడిపికి మద్దతు తెలిపిన పవన్ ఇప్పుడు సొంతంగా బరిలోకి దిగుతుండటంతో సమీకరణలు మారిపోయాయి. చంద్రబాబు తనను ఆనాడే మోసగించారని చెప్పిన పవన్ మరి తదనంతర కాలంలో టిడిపికి మద్దతు ఎందుకు తెలిపారన్నది ప్రశ్న.. సమర్ధుడు, అనుభవజ్ఞుడు అయినందునే చంద్రబాబుకు మద్దతు ఇచ్చానని పవన్ చెబుతున్నా ఆ సమాధానం సమంజసంగా అనిపించడం లేదు. వ్యక్తిగత ప్రయోజనాలు పక్కన పెట్టి, ప్రజల కోసమే కెరీర్ ను వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెబుతున్నా చంద్రబాబుతో జతకట్టడంలో స్వార్ధం ఉందన్న భావన బలపడుతోంది.

నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు పట్టించుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరచుకున్న పవన్ కల్యాణ్ సరిగ్గా పాపులారిటీ సంపాదించుకుంటున్న సమయంలోనే ఇలా తెలివి తక్కువగా మాట్లాడి అడ్డంగా బుక్ అయిపోయారు పవన్ కల్యాణ్ ప్రసంగం సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ పెద్ద జోక్ లా మారిపోయింది. ఇకనైనా మాట్లాడేముందు ఏం మాట్లాడాలో ముందే అనుకుని మాట్లాడితే మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories