ప్ర‌త్యేక‌హోదా కోసం బ‌లిదానం అవుతా

ప్ర‌త్యేక‌హోదా కోసం బ‌లిదానం అవుతా
x
Highlights

జ‌న‌సేన అధినేత ప‌వన్ క‌ల్యాణ్ కేంద్రానికి హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఏపీకి ప్ర‌త్యేక‌హ‌దా ఇచ్చే విష‌యం పై బీజేపీ గ‌డిగ‌డికో...

జ‌న‌సేన అధినేత ప‌వన్ క‌ల్యాణ్ కేంద్రానికి హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఏపీకి ప్ర‌త్యేక‌హ‌దా ఇచ్చే విష‌యం పై బీజేపీ గ‌డిగ‌డికో మాట‌మాట్లాడుతుంద‌ని అన్నారు. మాకు పౌరుషం, ఆత్మ‌గౌర‌వం ఉన్నాయి. ఒక‌రోజు ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇస్తామ‌ని , మ‌రోసారి ప్ర‌త్యేక‌హోదా ఇవ్వ‌లేమ‌ని చేత‌లు దులుపుకుంటే చూస్తూ ఊరుకోం. ఆమ‌ర‌ణ దీక్ష చేసైనా స‌రే సాధించుకుంటామ‌ని తెలిపారు.
గుంటూర‌లో జ‌రిగిన పార్టీ ఆవిర్భావ స‌భ‌లో మాట్లాడిన ప‌వ‌న్ కేంద్రం - టీడీపీ పై మండిప‌డ్డారు. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా - రైల్వే జోన్ ఇవ్వ‌లేమ‌ని కేంద్రం చెప్పిన నేప‌థ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని, ఆ అవసరం వస్తుందని అనుకుంటున్నానని, తన ప్రాణాలను బలిదానం అవుతానని పవన్ కల్యాణ్ అన్నారు.
పొట్టి శ్రీరాములు స్ఫూర్తి ఇంకా ఉందని, ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉన్నామని, బాధ్యతతో ఉన్నామని అన్నారు. తన ఆమరణ దీక్ష చేపట్టిన తర్వాత పరిణామాలు తన చేతుల్లో ఉండవని అన్నారు. అందుకు ప్రభుత్వాలే బాధ్యత వహించాలని అన్నారు.
అంతేకాదు ఉగాది పండుగ వ‌ర‌కు ఇక్క‌డే ఉంటామ‌న్న ప‌వన్ ఏపీకి ప్ర‌త్యేక‌హోదా సాధించే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా సాధన కోసం చేసే పోరాటానికి కలిసి వచ్చే పార్టీలతో పార్టీ కార్యాలయంలో చర్చలు జరుపుతానని అన్నారు. సిపిఐ, సిపిఎంలతో చర్చలు జరపనున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా కార్యాచరణకు ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు.
ప్ర‌త్యేక‌హోదా కోసం మీ బ‌లిదానాల్ని కోర‌బోన‌ని ప‌వ‌న్ అన్నారు. విద్యార్ధులు చ‌దువుకోవాలి. ఉద్యోగ‌స్థులు ఉద్యోగాలు చేసుకోవాలి. నేను రాజ‌కీయం చేస్తా . అవసరమైతే బలిదానం చేస్తాన‌ని ప‌వ‌న్ అన్నారు. తెలుగువాడి తెగింపు, ఆత్మగౌరవం ఎలా ఉంటుందో కేంద్ర ప్రభుత్వానికి చూపిద్దామని ఆయన పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories