టీడీపీతో పొత్తుపై స్పందించిన ప‌వ‌న్ క‌ల్యాణ్

టీడీపీతో పొత్తుపై స్పందించిన ప‌వ‌న్ క‌ల్యాణ్
x
Highlights

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా అనే విష‌యంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కొద్ది సేప‌టిక్రితం...

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా అనే విష‌యంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.
కొద్ది సేప‌టిక్రితం ప్ర‌జ‌ల‌తో ముఖాముఖి నిర్వ‌హించిన ప‌వ‌న్ ..2019లో టీడీపీతో క‌లిసి ప‌నిచేస్తారా..? అన్న‌ ప్ర‌శ్న‌కు ప్ర‌జాభీష్టం మేర‌కు త‌మ‌పార్టీకి ముందుకు సాగుతుంద‌ని సూచించారు. ఎన్నిక‌ల స‌మ‌యం ఉంది క‌దా . పొత్తుపై గురించి ఎన్నిక‌ల స‌మాయ‌నికి నిర్ణ‌యించుకుంటామ‌ని తెలిపారు.
ఇక రాజ‌కీయ ప‌రంగా సీఎం చంద్ర‌బాబుతో స‌హా ఎవ‌రితో విభేదాలు లేవ‌న్నారు. త‌మ‌కు అమ‌రావ‌తిలో పాత్ర‌లేద‌నే భావ‌న‌లో రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లు ఉన్నార‌ని, అభివృద్ధిని రాష్ట్ర వ్యాప్తంగా విస్త‌రించాల‌ని పేర్కొన్నారు. అంద‌రు క‌లిసి క‌ట్టుగా ఉంటే స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మవుతాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ప్ర‌తీ ఒక్క‌రు త‌మ రాజ‌కీయ స్వార్ధం కోసం వాగ్ధానాలు, శిలాప‌లకాలు, ఉచిత హామీలు ప్ర‌క‌టిస్తార‌ని తాను అలాంటి వాడిని కాద‌ని సూచించారు.
ఈ సంద‌ర్భంగా గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌జాప్ర‌తినిధులు ఇచ్చిన ఎన్ని హామీల‌ను నెర‌వేర్చాల‌ని లేదంటే తాము త‌ప్పు చేశామ‌ని ఒప్పుకోవాల‌ని డిమాండ్ చేశారు. లేదంటే హామీలు నెర‌వేర్చితే ఎలాంటి ఇబ్బందులు త‌లెత్తున్నాయో ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌న్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories