పవన్‌ కల్యాణ్‌ నా బిడ్డను పట్టించుకోలేదు

పవన్‌ కల్యాణ్‌ నా బిడ్డను పట్టించుకోలేదు
x
Highlights

గతనెల పశ్చిమగోదావరి జిల్లా హుకుంపేట గ్రామంలో గత నెల 9న దేవరపల్లిలో పవన్‌ అభిమానుల బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ప్రమాదశాత్తు ఓ పవన్ అభిమాని రాజ మనోహర్‌...

గతనెల పశ్చిమగోదావరి జిల్లా హుకుంపేట గ్రామంలో గత నెల 9న దేవరపల్లిలో పవన్‌ అభిమానుల బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ప్రమాదశాత్తు ఓ పవన్ అభిమాని రాజ మనోహర్‌ ను మరో బైక్ అతని పై నుండి వెళ్లడంతో హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స నిమిత్తం కీడ్నిని తొలగించి ఆ బాబును కాపాడారు డాక్టర్లు. పోయిన నెలలో రాజ మనోహర్‌ గాయపడగా ఇప్పటివరకు తమను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖం కూడా చూడలేదని బాధితుడి తండ్రి వాపోతున్నాడు. అయితే గాయపడిన తన కుమారడి ఫోటోలు కొవ్వూరులో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో బాధితుడి స్నేహితులు పవన్ కు ఫోటోలు చూపించినా పవన్ మాత్రం అసలు మనోహర్ ఏలా ఉన్నాడని కూడా అడగలేదని మనోహర్ తండ్రి రోదిస్తున్నాడు. తన కొడుకు కోసం రూ. 5లక్షలు అప్పు చేసి మరి తన కొడుకును కాపాడుకున్నానని వెల్లడించారు. మళ్లీ మరోహర్‌కు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందని నా కొడుకును కాపాడుకోవాడానికి ఎవరైనా దతాలు ముందుకొచ్చి ఆదుకొవాలని మనోహర్ తండ్రి వేడుకుంటున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories