ప‌రిటాల కుటుంబంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ భేటీ..ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

ప‌రిటాల కుటుంబంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ భేటీ..ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
x
Highlights

పవన్ అనంతపురం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించడంపై ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్‌ హిందూపురాన్నే తన...

పవన్ అనంతపురం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించడంపై ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్‌ హిందూపురాన్నే తన రాజకీయ కేంద్రంగా ఎంచుకున్నారు. తన సొంత ఊరుతో పాటు తిరుపతిని కూడా కాదని అనంత నుంచే ఆయన శాసనసభకు ప్రాతినిథ్యం వహించారు. అనంతరం నందమూరి బాలకృష్ణ కూడా హిందూపురం నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తాజాగా జనసేనాధినేత పవన్‌కల్యాణ్‌ అనంతపురం నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టడంపై పార్టీ నేతల్లో హర్షం వ్యక్తమవుతోంది.
నిన్న అనంతపురంలోని గుత్తి రహదారిలో జనసేన పార్టీ కార్యాలయానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం స‌భ‌లో ప్ర‌స‌గించిన ప‌లు అంశాల్ని లేవ‌నెత్తారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఎంత దూర‌మైనా
వెళ‌తాన‌న్న ప‌వ‌న్ నేడు మంత్రి ప‌రిటాల సునిత‌తో భేటీ అయ్యారు.

ప‌రిటాల కుటుంబానికి , త‌న‌కు మ‌ధ్య ఏదో జ‌రిగింద‌న్న వార్త‌ల్ని చెక్ పెట్టారు. ఈనేప‌థ్యంలో అనంత‌రం పురం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ మంత్రి ప‌రిటాల సునీత‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రైతుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు. అనంత‌పురంలోని నీటి స‌మ‌స్య‌, హాంద్రీనీవా ప్రాజెక్ట్ వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగాలు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి అవుతుంద‌నే ప‌లు ఆంశాల‌పై ప‌రిటాల సునిత‌, సంబంధిత అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జ‌న‌సేనాని మాట్లాడుతూ జిల్లాలో నెలకొన్న సమస్యల్ని అధికార పార్టీ నేత‌ల దృష్టికి తీసుకెళుతున్న‌ట్లు తెలిపారు.అంతేకాదు త్వ‌ర‌లో రాయాల‌సీమ‌పై పూర్తి అధ్య‌యనం చేసి అక్క‌డ హైకోర్టు, ఇత‌ర అంశాల‌పై పీఎం మోదీ తో భేటీ కానున్న‌ట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే గ‌తంలో ప‌రిటాల కుటుంబానికి - త‌న గురించి వ‌చ్చిన వార్త‌ల‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. గ‌తంలో వ‌చ్చిన వార్త‌ల‌కు త‌న‌కు సంబంధంలేదని , తాను మొద‌టిసారి ప‌రిటాల కుటుంబాన్ని క‌లిసింది అంటూ న‌వ్వుతూ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories