పరకాలపై మండిపడ్డ పవన్

Highlights

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పర్యటన కొంత రాజకీయ వేడిని పుట్టించిందనే స్పష్టంగా అర్ధమవుతుంది.. నిన్న వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్షనేత వైయస్...

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పర్యటన కొంత రాజకీయ వేడిని పుట్టించిందనే స్పష్టంగా అర్ధమవుతుంది.. నిన్న వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిపై సంచలన వ్యాఖ్యలు చేసారు.. అదే క్రమంలో తన అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో వుంటూ పార్టీకి ద్రోహం చేసిన వారిపై కూడా మాట్లాడుతూ అవసరమొచ్చినప్పుడు పరకాల ప్రభాకర్ పని చెప్తానని హెచ్చరించారు..

నిస్వార్థ‌మైన వారు ప్ర‌జారాజ్యం పార్టీలో ఉండుంటే ప్ర‌జారాజ్యం ఇప్పుడు అధికారంలో ఉండేదని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌నే ఆలోచ‌న చిరంజీవికి ఉండేదని చెప్పుకొచ్చారు. కాగా, ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌, నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌త్యేకహోదాపై ఎందుకు మాట్లాడ‌రు? అని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శ్నించారు. హోదాపై తానొక్క‌డినే మాట్లాడాలా? అని నిల‌దీశారు. గుర్తింపు ఇవ్వ‌లేద‌ని చిరంజీవిపై అంతెత్తున లేచినవారు ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం జ‌రుగుతున్నా ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని పరకాలపై మండిపడ్డారు పవన్.. కాగా పవన్ వ్యాఖ్యలపై పరకాల ప్రభాకర్ మాట్లాడకపోవడం గమనార్హం..

Show Full Article
Print Article
Next Story
More Stories