ప‌వ‌న్ క‌ల్యాణ్ ను భ‌య‌పెడుతున్న సెంటిమెంట్

ప‌వ‌న్ క‌ల్యాణ్ ను భ‌య‌పెడుతున్న సెంటిమెంట్
x
Highlights

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు , ఆయ‌న అభిమానుల్ని ఓ సెంటిమెంట్ వెంటాడుతుంది. చిరంజీవి సినిమాల్లో మెగ‌స్టార్. కానీ రాజ‌కీయాల్లో మెర‌వ‌లేక‌పోయారు....

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు , ఆయ‌న అభిమానుల్ని ఓ సెంటిమెంట్ వెంటాడుతుంది.
చిరంజీవి సినిమాల్లో మెగ‌స్టార్. కానీ రాజ‌కీయాల్లో మెర‌వ‌లేక‌పోయారు. నాటి నుంచి నేటి వ‌ర‌కు సినిమాల్లో త‌న విజ‌యాల ప‌ర‌ప‌రంను కొన‌సాగించిన చిరంజీవి రాజ‌కీయాల్లో అడుగుపెట్టేలా పావులు క‌దిపారు. పాలిటిక్స్ లో ఎంట్రీ అంటే ఆషామాషీగా కాకుండా ఓ సినిమా హిట్ కొట్టి ఆ తరువాత రాజ‌కీయాలవైపు మొగ్గుచూపాల‌ని అనుకున్నారు. కానీ అంత క్రెడిబిలిటీ వున్న హీరో కి సైతం శంకర్ దాదా జిందాబాద్ వంటి ఫెయిల్యూర్ రాజకీయ ప్రవేశం పై ఎఫెక్ట్ కొట్టింది.
ఆ త‌రువాత ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చిన చిరంజీవి సీఎం అవుతార‌ని అభిమానులు క‌ల‌లు క‌న్నారు. కానీ అభిమానుల‌కు అక్క‌డా నిరాశ ఎద‌రైంది. ఇక ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అజ్ఞాతవాసి వంటి ఘోర పరాజయం అనంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం సెంటిమెంట్ పరంగా కళ్యాణ్ ని సీఎంగా చూడాలి అనుకుంటున్న అభిమానులని భయపెడుతుంది. పైగా ఇప్పట్లో సినిమా ఆలోచనలేవీ లేవని స్పష్టం చేశారు కళ్యాణ్. మరి జనసేన సిద్ధాంతాలతో వారి కుటుంబానికి వున్న బాడ్ సెంటిమెంట్ ని ఎలా తిరగరాస్తారో 2019 ఎన్నికలు తేల్చనున్నాయి

Show Full Article
Print Article
Next Story
More Stories