logo
ఆంధ్రప్రదేశ్

పవన్ అన్నా నా అంత్యక్రియలునువ్వే చేయాలి

పవన్ అన్నా నా అంత్యక్రియలునువ్వే చేయాలి
X
Highlights

పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అభిమానం ఉన్న ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పాడ్డాడు. విజయవాడలోని ఓ జిమ్‌లో ట్రైనర్‌గా పని ...

పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అభిమానం ఉన్న ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పాడ్డాడు. విజయవాడలోని ఓ జిమ్‌లో ట్రైనర్‌గా పని చేస్తున్న కొమరవల్లి అనీల్ కుమార్ అనే యువకుడు,"పవన్ అన్నా నువ్వంటే నాకు పిచ్చి అభిమానం,నిన్ను చూడలేదనే భాద నాకు ఎక్కువగా ఉంది,ఇక ముందు నాజీవితంలో నిన్ను చూడలేను కూడా,నువ్వు తప్పకుండా నన్ను చూడటానికి రావాలి,నీ చేతుల మీదగా నా అంత్యక్రియలు చేయాలి,తప్పని సరి పరిస్థితుల్లో నేను చనిపోతున్నాను",అని పవన్ కళ్యాణ్ కు లెటర్ రాసి మరి ఆత్మహత్య చేసుకున్నాడు.

స్థానికంగా జరిగిన ఈ ఘటన పలువురిని కలచి వేస్తుంది.నేను చనిపోయిన విషయం పవన్ కళ్యాణ్ అన్నకు తెలియజేయండి,అంటూ లెటర్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న విధానం అందరిని విషాధానికి గురిచేసింది.అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.గత కొన్ని రోజులుగా అనీల్ డల్‌గా ఉన్నట్టు సన్నిహితులు చెప్పారు.

Next Story