logo
ఆంధ్రప్రదేశ్

కన్నీటిపర్యంతమైన పవన్ కళ్యాణ్!

కన్నీటిపర్యంతమైన పవన్ కళ్యాణ్!
X
Highlights

అభిమాని మృతితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కన్నీటిపర్యంతమయ్యారు. రెండురోజుల కిందట జనసేన ఫ్లెక్సీ కడుతూ.....

అభిమాని మృతితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కన్నీటిపర్యంతమయ్యారు. రెండురోజుల కిందట జనసేన ఫ్లెక్సీ కడుతూ.. ప్రమాదవశాత్తు శివ అనే అభిమాని మృతిచెందాడు. దీంతో శివ కుటుంబాన్ని పరామర్శించారు.. శివ భార్య , తలిదండ్రులను చూసిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కాగా ప్రజాపోరాట యాత్రలో భాగంగా పవన్ గురువారం పాయకరావుపేట వస్తున్నట్టు తెలుసుకున్న ఆయన అభిమానులు శివ , నాగరాజు పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా, వాటికి ఉన్న ఇనుప చట్రం, పైన వున్న విద్యుత్‌ తీగలకు తగిలింది. దీంతో భీమవరపు శివ (28), తోళెం నాగరాజు(30) విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.

Next Story