పవన్ పోటీ చేసే నియోజకవర్గం ఇదే!!

పవన్ పోటీ చేసే నియోజకవర్గం ఇదే!!
x
Highlights

జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారోనన్న ఆసక్తి ఇవాళ్టితో తేలిపోయింది. తమ అధినేత పవన్ కళ్యాణ్ అవనిగడ్డ నుంచి...

జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారోనన్న ఆసక్తి ఇవాళ్టితో తేలిపోయింది. తమ అధినేత పవన్ కళ్యాణ్ అవనిగడ్డ నుంచి పోటీ చేస్తారంటూ కృష్ణా జిల్లా జనసేన పార్టీ ఇంచార్జి ముత్తంశెట్టి కృష్ణారావు తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సదస్సుకు అయన ముఖ్య అతిధి హాజరయ్యారు.. ఈ సందర్బంగా పవన్ పోటీ ఇక్కడినుంచేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనిగడ్డలో నియోజకవర్గంలో జనసేనను బలోపేతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని కన్వీనర్ విజయనిర్మల వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే అనంతపురం జిల్లా కదిరి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ ఉంటుందని వార్తలు వచ్చాయి కానీ అధినేతనుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. తాజాగా పార్టీ నేత కృష్ణారావు ప్రకటన అనధికారికమా? లేక పార్టీ నిర్ణయమా అనేది మరి కొద్ది రోజుల్లో తేలిపోనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories