logo

వారికీ మాత్రమే సంపూర్ణ రుణమాఫీ చేస్తాం : పవన్ కళ్యాణ్

వారికీ మాత్రమే సంపూర్ణ రుణమాఫీ చేస్తాం : పవన్ కళ్యాణ్

టిట్లీ తుఫాను వాళ్ళ నష్టపోయిన రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయకుంటే వలసలను ప్రోత్సహించినట్టే అవుతుందని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పార్టీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన ఆయన తుఫాను బాధితులను ఆదుకోవడంలో జనసైనికులు సహకారం అందించాలని కోరారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాతో తనకు ఎంతో అనుబంధం ఉందని అన్నారు.. ఇటీవల సంభవించిన టిట్లీ జిల్లాను అతలాకుతలం చేసిందని, ఇప్పటికీ ఉద్దానం ఇంకా చీకట్లో ఉందని చాలామంది కి తెలియదు అని అన్నారు.. అదేసమయంలో బాధితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదిశగా చర్యలు చేపట్టడంలో విఫలమయ్యిందని పేర్కొన్నారు.. కేవలం ప్రచారాలకు తప్ప ఆచరణలో సహాయం అందడంలేదని అభిప్రాయపడ్డారు. హుదూద్ తుఫగాను సంభవించినప్పుడు సహాయానికి ముందుకువచ్చిన వాళ్ళు శ్రీకాకుళం అంటే ఎందుకంత నిర్లక్ష్యమో అర్థంకావటంలేదని అన్నారు.

ఉద్యానవనంగా ఉండే ఉద్దానం ప్రాంతాన్ని టిట్లీ తుఫాను ఎడారిలా మార్చేసిందని అన్నారు..ముఖ్యంగా రైతుల కష్టం చూసి చలించిపోయాయని అన్నారు..అదేసమయంలో తుఫాను వాళ్ళ నష్టపోయిన చెట్లు కు వందో ఐదో వందలు పరిహారం అందించడం కాదు సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు..లేని పక్షంలో జనసేన అధికారంలోకి రాగానే ఉద్దానంలోని రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేస్తుందని భరోసా ఇచ్చారు.. బాధిత గ్రామాల్లో నీరు , నిత్యావసర సరుకు పూర్తి స్థాయిలో అందితున్నాయని అసత్య ప్రచారం జరుగుతోయిందని అన్నారు.. దాదాపు అన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా ప్రారంభం అయిందని ప్రకటనలు చేస్తున్న ముఖ్యమంత్రి, తెలుగు దేశం నాయకులు మారు మూల గ్రామంలోకి వేళ్ళడం లేదని ఎద్దేవా చేశారు.. అభివృద్ధి కోసమే పార్టీ స్థాపించానన్న పవన్ అధికారం పై తనకు మోజు లేదని స్పష్టం చేశారు.. వలసలు నివారించడమే జనసేన లక్ష్యమని వలస వెళ్లిన వారిని తిరిగి తీసుకువచ్చెనందుకు జనసేన శాయశక్తులా కృషిచేస్తుందని అన్నారు.

25 కేజీల బియ్యం కాదు. 25 ఏళ్ళ జీవితం కావాలి. ఏ ఒక్కరూ కూడా తమ భూములను విక్రయించవద్దని హితువు పలికారు.. అదేసమయంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస సాయంపై గవర్నర్ కితాబు ఇవ్వడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు.. క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిస్థితులు తెలుసుకుంటే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు.. జనసేన రాజకీయాల కోసం తిరగటం లేదని కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా జనసేన పనిచేస్తుందని అన్నారు.. ప్రధాన మంత్రి కూడా స్పందించకపోవడం విచారకరమని అన్నారు.. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం టిట్లీ తృఫాను ను జాతీయ విపత్తుగా ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.. కష్టాల్లో ఉన్న తుఫాను బాధితులపై అధికార పార్టీ నాయకులు దాడులకు, కేసులకు ప్రయత్నిస్తే జనసేన ఊరుకోదని హెచ్చరించారు.. రాజకీయాలకు అతీతంగా అందరూ బాధితులను ఆదుకోవాలని అన్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 వేళ్ళతో జేబులో నుండి తీస్తే డబ్బులు బయటకి వస్తాయని, 2 వేళ్ళతో తీస్తే చిల్లరి వస్తుందనేని గుర్తించాలని చమత్కరించారు.

nanireddy

nanireddy

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top