Top
logo

జగన్ పై పవన్ అనవసరంగా విమర్శలు చేసారా..?

Highlights

నిన్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా విశాఖలో ఏర్పాటు చేసిన సభలో...

నిన్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా విశాఖలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. నాకు జగన్ పై కోపం లేదనంటూనే అయన చేసిన అవినీతి వలెనే తాను పోయిన ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇవ్వలేదని చెప్పారు.. అంతేకాదు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, అయన పరిపాలన గురించి కూడా మండిపడ్డారు.. అయన సరిగా పరిపాలన చేసి ఉంటే ఇలా అయ్యుండేది కాదని చెప్పారు.. ఈ క్రమంలో ఒక అడుగు ముందుకేసి వారసత్వ రాజకీయాలు అంటే తనకు నచ్చవని పరోక్షంగా జగన్ పై మండిపడ్డారు..

కాగా పవన్ చేసిన వారసత్వ రాజకీయాలపై సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు విపరీతనంగా కామెంట్స్ చేస్తున్నారు.. వారసత్వ రాజకీయాలపై మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ చిరంజీవి ద్వారా మీ సినీ వారసత్వాన్ని ప్రశ్నించుకోవాలని, మీరు మాత్రం అన్న చిరంజీవిని అడ్డంపెట్టుకుని సినీ రంగ ప్రవేశం చెయ్యవచ్చు, జగన్ మాత్రం తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకోకూడదా అంటూ జనసేనానిని ప్రశ్నిస్తున్నారు..

అంతేకాదు జగన్ పై , పవన్ అదే పనిగా అవినీతి ఆరోపణలు చెయ్యడం సరికాదని అంటున్నారు.. ఒకవైపేమో జగన్ ని తిడుతూ, మరోవైపు చంద్రబాబు పరిపాలనను సమర్ధిస్తున్నారని మండిపడుతున్నారు.. రాష్ట్రానికి అత్యంత కీలకమైన పోలవరం నిర్మాణంపై అసెంబ్లీలో చేతులెత్తేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించకుండా జగన్ ను విమర్శించడంలో అర్ధమేంటని వారు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు.. కాగా అసలే వైసీపీకి కాస్తంత సోషల్ మీడియా ఫాలోవింగ్ ఎక్కువగా వున్నా తరుణంలో పవన్, వైసీపీపై ఇలాంటి వ్యాఖ్యలు చేసి అనవసరంగా టార్గెట్ అవుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది..

Next Story