పరిపూర్ణానంద మరో కాషాయ నాయకుడా? లడ్డూ వార్త వెనుక లాజిక్‌!!

పరిపూర్ణానంద మరో కాషాయ నాయకుడా? లడ్డూ వార్త వెనుక లాజిక్‌!!
x
Highlights

తెలంగాణలో ఒంటరిపోరుకు సిద్దమైన కాషాయదళం, సరికొత్త వ్యూహానికి పథక రచన చేస్తోందా...ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రయోగం తరహాలో, తెలంగాణలోనూ మరో కాషాయ నాయకున్ని...

తెలంగాణలో ఒంటరిపోరుకు సిద్దమైన కాషాయదళం, సరికొత్త వ్యూహానికి పథక రచన చేస్తోందా...ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రయోగం తరహాలో, తెలంగాణలోనూ మరో కాషాయ నాయకున్ని సంధించాలనుకుంటోందా? స్వామి పరిపూర్ణానంద లడ్డూలాంటి లాంటి వార్త వెనుక జరిగిన కథేంటి? తెలంగాణ బీజేపీ అసెంబ్లీ ఎన్నికల వేళ కొత్త వ్యూహం అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఎవ్వరూ ఊహించని రాజకీయ చతురతకు పావులు కదుపుతోంది. దేశంలో హిందు ఎజెండాను భుజాన వేసుకున్న కాషాయపార్టీ, అదే ఎజెండాను తెలంగాణలో అమలు చేయడానికి స్ట్రాటజీ వేస్తున్నట్లు కనపడుతోంది. ఇప్పటికే యూపీలో యోగి ప్రయోగం సక్సెస్‌ కావడంతో, ఇక తెలంగాణాలో మరో యోగిని రంగంలో దించాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రయోగం ఫైర్‌ బ్రాండ్‌ స్వామి పరిపూర్ణానంద...

ఒకవైపు ఆధ్యాత్మిక ప్రవచనాలు, మరోవైపు హిందుత్వ అజెండాను భుజనా వేసుకున్న స్వామి పరిపూర్ణానంద, ఎన్నోసార్లు పొలిటికల్‌ హీట్‌ పుట్టించే మాటలు మంటలు రగిలించారు. అలాంటి ఫైర్‌ బ్రాండ్‌ పరిపూర్ణానంద స్వామిని, పార్టీలో తీసుకురావడానికి బీజేపీ శతవిధాలా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన రాజకీయ రంగ ప్రవేశంతో పార్టీ మరింత బలం పుంజుకుంటుందని అధిష్టానం లెక్కలువేస్తోంది. త్రిముఖ పోటీ కారణంగా, హిందూ ఓట్ల సమీకరణకు స్వామిజీనే అస్త్రంగా బీజేపీ గట్టిగా భావిస్తోంది.

మాములుగా హిందుత్వం ఎజెండా కాకుండా, అదే భుజానికెత్తుకున్న వారిని ఫేస్‌గా చేసి వెళ్తే బాగుంటుందని పార్టీ నేతల చర్చ. అందుకే ఈ ఎన్నికలో సీఎం అభ్యర్థిగా, స్వామిజీని ప్రకటించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. స్వామిజీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఎలా ఉంటుందని, అమిత్‌ షా, ఇప్పటికే రాష్ట్ర పార్టీ అభిప్రాయం తీసుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. దీనికి తోడు ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాతో పరిపూర్ణానంద ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేసినా, స్వామిజీ ఒప్పుకోకపోవడంతో భేటీ జరగలేదని సమాచారం. ఇక ఇటీవల స్వామిజీ ఢిల్లి పర్యటనలో బీజేపీ పెద్దలను కలిసొచ్చినట్లు తెలిసింది. ఇదే విషయమై, పరిపూర్ణానందను హెచ్‌ఎంటీవీ సంప్రదించగా, నర్మగర్భంగా సమాధానమిచ్చారాయన. త్వరలో పెద్ద వార్త వింటారని చెప్పడంతో, పరిపూర్ణానంద రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలకు బలం చేకూరినట్టయ్యింది.

బీజేపీ అధిష్టానం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను భేరీజు వేస్తోంది. హైదరాబాద్ వేదికగా నిర్వహించే హిందూ ఊరేగింపులకు, సభలు, సమావేశాలకు వచ్చే జనం భారీగా ఉన్నా, ఆ జనాన్ని ఓటు బ్యాంక్‌గా మార్చుకోలేకపోతున్నామనే భావనలో పార్టీ ఉంది. అదే విధంగా హైదరాబాద్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్, కరీంనగర్‌లో బండి సంజయ్ నిర్వహించే కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన ఉండడం, కూడా స్వామిజిని సీఎం అభ్యర్థిగా రంగంలో దించితే, ప్రయోజనమని ఆలోచిస్తోంది. దీనికి తోడు త్రిముఖ పోటీలో గౌరవ ప్రదమైన ఓట్లు రాల్చుకోవడానికి ఇదే సరైన మార్గమని పార్టీ భావిస్తున్నట్లు అర్థమవుతోంది. స్వామిజీని సీఎం అభర్దిగా ప్రకటిస్తే.. ఆయన మద్దతుదారులు రాజకీయాల్లోకి వచ్చి బీజేపీ నుంచి పోటీ చేసి, పార్టీని బలోపేతం చేస్తారని పార్టీ అంచనా. పార్టీ అనుబంధ సంఘాలు సైతం స్వామిజీకి అనుకూలంగా ఉండటంతో, అన్నీ అనుకున్నట్లు జరిగితే స్వామి పరిపూర్ణనందానే, బీజేపీ తెలంగాణ సీఎం అభ్యర్థి.

Show Full Article
Print Article
Next Story
More Stories