logo
జాతీయం

కుక్కతోక వంకర పాకిస్థాన్ వక్రబుద్ధి రెండూ మారవు.. మరోసారి..

కుక్కతోక వంకర పాకిస్థాన్ వక్రబుద్ధి రెండూ మారవు.. మరోసారి..
X
Highlights

కుక్కతోక వంకర పాకిస్థాన్ వక్రబుద్ధి రెండూ మారవు.. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నా పాక్...

కుక్కతోక వంకర పాకిస్థాన్ వక్రబుద్ధి రెండూ మారవు.. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నా పాక్ వక్రబుద్ధి మారడం లేదు ఒప్పందానికి మరోసారి తూట్లు పొడిచింది. ఓ వైపు విరమణ పాటిద్దామని చెబుతూనే.. ఇంకోవైపు కాల్పులతో కవ్విస్తోంది. అదును చూసుకుని భారత సైన్యంపై అక్రమంగా దాడులు చేస్తోంది. ఆదివారం తెల్లవారుజామున జమ్మూకశ్మీర్‌ పరగ్వాల్‌ సెక్టార్‌లోని అక్నూర్‌లో జమాన్‌ బెళా పోస్టుపై పాకిస్తాన్‌ రేంజర్లు దొంగ చాటుగా దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు భారతీయ జవాన్లు సహా మరో ముగ్గురు పౌరులు మృతిచెందారు. దీంతో భారత్ దళాలు మరింత అప్రమత్తమయ్యాయి. పాక్ అక్రమ స్థావరాలపై ప్రతి కాల్పులు జరుపుతున్నాయి. ఇదిలావుంటే పాక్ అక్రమ దాడి గురించి ప్రధాని ఆరా తీసినట్టు సమాచారం.

Next Story