logo
జాతీయం

పాకిస్థాన్ లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ ఖాన్ పార్టీ విజయం..?

పాకిస్థాన్ లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ ఖాన్ పార్టీ విజయం..?
X
Highlights

పాకిస్థాన్ లో అధికార పీఎంఎల్‌ కు భారీ షాక్ తగిలింది. మొత్తం 272 స్థానాల్లో 121కి పైగా సీట్లలో ఇమ్రాన్‌ ఖాన్...

పాకిస్థాన్ లో అధికార పీఎంఎల్‌ కు భారీ షాక్ తగిలింది. మొత్తం 272 స్థానాల్లో 121కి పైగా సీట్లలో ఇమ్రాన్‌ ఖాన్ పార్టీ విజయం సాధించింది. ఇప్పటివరకూ అధికారంలో ఉన్న నవాజ్‌ షరీఫ్‌ పార్టీ పీఎంఎల్‌.... 58 సీట్లతో రెండో స్థానంలో నిలవగా.... మరో ప్రధాన పార్టీ పీపీపీ.... 35 స్థానాలతో థర్డ్‌ ప్లేస్‌లో నిలిచింది. ఇక ఇతరులు 50కి స్థానాల్లో విజయం సాధించారు. అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన ఇమ్రాన్‌ ఖాన్ పార్టీ పీటీఐ... సంపూర్ణ మెజారిటీకి దాదాపు 15-16 సీట్ల దూరంలో ఆగిపోయింది. అయితే ఇతరుల మద్దతుతో ఇమ్రాన్ ఖానే... పాకిస్తాన్‌ కొత్త ప్రధానిగా పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీలో మొత్తం 342మంది సభ్యులు ఉంటారు. అందులో 272మందిని నేరుగా ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు. మిగతా 70మందిని ఆయా పార్టీలు సాధించిన ఓట్ల ప్రకారం ఎంపిక చేస్తారు. ఈ లెక్కన మొత్తం 172 స్థానాలు సాధించిన పార్టీయే అధికారంలోకి వస్తుంది.

Next Story