logo
సినిమా

ప‌ద్మావ‌త్‌ రివ్యూ

ప‌ద్మావ‌త్‌ రివ్యూ
X
Highlights

చిత్రం - ప‌ద్మావ‌త్ న‌టీన‌టులు: దీపికా ప‌దుకొణె.. షాహిద్ క‌పూర్‌.. ర‌ణ్‌వీర్ సింగ్ త‌దిత‌రులు సంగీతం:...

చిత్రం - ప‌ద్మావ‌త్
న‌టీన‌టులు: దీపికా ప‌దుకొణె.. షాహిద్ క‌పూర్‌.. ర‌ణ్‌వీర్ సింగ్ త‌దిత‌రులు
సంగీతం: స‌ంజ‌య్ లీలా భ‌న్సాలి, సంచిత్ బ‌ల్హారా
దర్శకత్వం: సంజ‌య్ లీలా భ‌న్సాలి
నిర్మాత: సంజ‌య్ లీలా భ‌న్సాలి.. సుధాన్సు వాట్స్‌.. అజిత్
విడుద‌ల తేదీ: 25-01-2018
గ‌త కొద్ది నెల‌లుగా దేశంలో ప‌ద్మావ‌త్ చిత్రం ఎంత అల‌జ‌డి సృష్టించిందో మ‌నంద‌రికి తెలిసిందే. గ‌త కొన్నేళ్ల‌లో ఇంత వివాదాస్ప‌ద‌మైన చిత్రం మ‌రొక‌టి లేద‌ని చెప్పుకోవ‌చ్చింది. గ‌త సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ నెల‌ల‌లో విడుద‌ల కావాల్సిన ఈ సినిమా అన్నీ అడ్డంకుల్ని అధిగ మించి ఈ చిత్రం ఈ రోజే ప్రేక్ష‌కులకు ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రంలో కొన్ని సీన్లు రాజ్ పుత్ క‌ర్ణిసేన వ‌ర్గాన్ని కించ‌పరిచేలా తెర‌కెక్కించారంటూ ఆ సామాజిక వ‌ర్గం సినిమా విడుద‌ల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసింది. అయితే కోర్టు తీర్పుతో విడుద‌లైన ఈ చిత్రం రాజ్ పుత్ క‌ర్ణిసేన ఆరోపిస్తున్న‌ట్లు చిత్రీక‌రించారా లేదా ? అనే విష‌యాల్ని తెలుసుకోవాలంటే రివ్వ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ:
క్రీ.శ. 13, 14 శతాబ్దంలో సింఘాల్‌ రాజ్య యువరాణి ,రాజ్ పుత్ ల ఆత్మ‌గౌర‌వ నినాద‌మైన మ‌హారాణి ప‌ద్మావ‌తి అందచందాలకు దేశంలో అనేకమంది రాజులు ముగ్ధులవుతారు. చిత్తోర్‌గఢ్‌ పాలకుడైన రతన్‌సేన్‌ ఆమెను ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు. ఇదిలా ఉంటే ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ రాజ్య‌స్థాప‌న‌కై ఇత‌ర రాజ్యాల‌పై దండ‌యాత్ర చేసి ఆక్ర‌మించుకునేవాడు. అలా ఖిల్జీ క‌న్ను చిత్తోర్ గ‌ఢ్ రాజ్యం పై ప‌డింది. ఈనేప‌థ్యంలో పద్మావతి సౌందర్యం గురించి తెలుసుకున్న ఖిల్జీ ఆమెను సొంతం చేసుకోవాల‌నే కాంక్ష‌తో చిత్తోర్‌గఢ్‌పై దండెత్తుతాడు. ఈ దండ‌యాత్ర‌లో పద్మావతి భర్త రతన్‌సేన్ ఖ‌ల్జీని నిలువ‌రిస్తాడా..? ప‌ద్మావ‌తిని ద‌క్కించుకోవాల‌న్న ఖిల్జీ క‌ల ఫ‌లిస్తుందా..? యుద్ధంలో ఎవ‌రు విజ‌యం సాధించారు. చివ‌రికి ప‌ద్మావ‌తి ఏమైంది అనేది మిగిలిన క‌థ

కథనం -
క‌థ‌ని తెర‌కెక్కించ‌డంలో బాలీవుడ్ డైర‌క్ట‌ర్ సంజయ్ లీలా బ‌న్సాలీ స్టైలే వేరు. క‌మ‌ర్షియాలిటీని మ‌రిచి పోయి సినిమాను ఎలా క‌ళాత్మ‌కంగా తీయాల‌నే దానిపై దృష్టిపెడ‌తాడు. సేమ్ ప‌ద్మావ‌త్ కూడా అంతే. రాజ్ పుత్ క‌ర్ణీసేన అంటే ముందుగా యుద్దాలే గుర్తుకు వ‌స్తాయి. కానీ బ‌న్సాలీ మాత్రం కళాత్మ‌కి ఎక్కువ ప్ర‌యారిటీ ఇచ్చాడు. యుద్ధ స‌న్నివేశాల్ని కూల్ గా ముగించేశాడు. దీంతో స‌గ‌టు ప్రేక్ష‌కుడు రోమాలు నిక్క‌బొడిచేలా చేస్తాయ‌నుకుంటే...బ‌న్సాలీ మాత్రం ప్రేక్ష‌కుడు సినిమా గురించి ఆలోచించాల‌నే పందాలో సినిమా తీసిన‌ట్లు తెలుస్తోంది.
బాహుబ‌లిలో భారీ యుద్ధ స‌న్నివేశాలు, క‌మ‌ర్షియ‌ల్ అంగులు అన్నీ ఉన్నాయి. కానీ ప‌ద్మావ‌త్ లో అలాంటిది మ‌చ్చుతున‌కైనా ఎక్క‌డా క‌నిపించ‌లేదు. భారీ యాక్షన్ ఘట్టాలు.. ఫాంటసీలు కోరుకుంటే ‘పద్మావత్’ కచ్చితంగా నిరాశ పరుస్తుంది.
మొద‌ట రావల్-పద్మావతి పెళ్లితో ప్రారంభ‌మైన సినిమా క‌ట్టాకొట్టా తెచ్చా అన్న రీతులో స్లోగా కొన‌సాగుతుంది. రావ‌ల్ - ప‌ద్మావ‌తి పెళ్లి అనంత‌రం డిల్లీ రాజు ఖిల్జీ ఎంట‌ర్ అవ్వ‌డం . ప‌ద్మావ‌తి గురించి తెలుసుకోవడం. ఆమెను సొంతం చేసుకోవాల‌ని ఎత్తుగ‌డ‌వేయ‌డం. మధ్యలో ఖ‌ల్జీ క్రూరత్వాన్ని చూపించ‌డం. కొన్ని మలుపులు.. అంతిమంగా అతడి కోరిక నెరవేరకుండానే కథ ముగియడం.. ఇదీ ‘పద్మావత్’ నడిచే తీరు.

సినిమా నిర్మాణం ఎలా ఉందంటే
సినిమా నిర్మాణం గురించి చెప్పాలంటే మాట‌లు చాల‌వు. మేకింగ్, సెట్టింగ్, క్యాస్టూమ్స్ , డ‌బ్బింగ్ ఇవ‌న్నీ సూప‌ర్బ్ . కాక‌పోతే కథనంలో వేగం లేకపోవడం లో సగటు ప్రేక్షకుడికి‘పద్మావత్’ ను చూడ‌లేక‌పోవ‌చ్చు.

ఎవ‌రు ఎలా చేశారంటే

ఖ‌ల్జీ గా ర‌ణ్ వీర్ సింగ్ పాత్ర చాలా బాగుంది. స్క్రీన్ ప్ర‌జెంటేషన్ కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. దీపికా ప‌దుకొణె ఇప్ప‌టివ‌ర‌కు ఇలాంటి సినిమా తీయ‌లేదు.కాబ‌ట్టి ఆమె స‌గం ప్ల‌స్ పాయింట్అనే చెప్పుకోవాలి. ర‌త‌న్ సేన్ గా షాహిద్ క‌పూర్ బాగా యాక్ట్ చేశాడు. కొన్ని స‌న్నివేశాల్లో భ‌గ్న‌ప్రేమికుడిగా అల‌రించాడు.
డైరక్టర్ బ‌న్సాలీ క‌థ‌ను తెర‌కెక్కించ‌డంలో విజ‌యం సాధించాడు.సినిమాలో క‌ర్ణిసేన గురించి పొగ‌డ‌డంతోనే సగం సినిమాపూర్త‌వుతుంది. ఆ సామాజిక వ‌ర్గాన్నికించ‌ప‌రిచిన సంఘ‌ట‌న‌లు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. సినిమా మొత్తంలో పతాక సన్నివేశం అద్భుతంగా అనిపిస్తుంది. భావోద్వేగాల్ని తట్టి లేపేలా గొప్పగా ఆ సన్నివేశాన్ని చిత్రీకరించాడు బన్సాలీ. దర్శకుడిగా అతడి పనితనానికి క్లైమాక్స్ నిదర్శనంగా నిలుస్తుంది. ఇక ‘పద్మావత్’ చూస్తున్నంతసేపూ ఎందుకు ఈ సినిమాను రాజ్ పుత్ లు వ్యతిరేకించారన్నది అర్థం కాదు.

సాంకేతికవర్గం:

‘పద్మావత్’లో టెక్నికల్ వ్యాల్యూస్ బాగున్నాయి. సంగీతం, డైర‌క్ష‌న్ , క్యాస్టూమ్స్, సెట్టింగ్స్, అద్భుత‌మైన క‌ళాకండాలు, సంగీత దర్శకుడిగానూ మెప్పించాడు. . ఈ విషయంలో బెస్ట్ ఔట్ పుట్ వచ్చిన భారతీయ చిత్రాల్లో ఇదొకటిగా నిలుస్తుంది. ఐతే కథనం ఇంకాస్త బిగువుతో.. వేగంగా ఉండేలా చూసుకోవాల్సింది. అలాగే ఆయన కొంచెం సామాన్య ప్రేక్షకుడిని కూడా దృష్టిలో ఉంచుకుని సన్నివేశాలు తీర్చిదిద్దుకోవాల్సిందేమో.

Next Story