అందుకోసమే సీఎం చంద్రబాబు అమెరికా వెళ్లారు : పీఏసీ ఛైర్మెన్ బుగ్గన

అందుకోసమే సీఎం చంద్రబాబు అమెరికా వెళ్లారు : పీఏసీ ఛైర్మెన్ బుగ్గన
x
Highlights

సీఎం చంద్రబాబుపై పీఏసీ ఛైర్మెన్, వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు.. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించానని చంద్రబాబు దొంగ...

సీఎం చంద్రబాబుపై పీఏసీ ఛైర్మెన్, వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు.. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించానని చంద్రబాబు దొంగ ప్రచారాలు చేసుకుంటున్నారన్న బుగ్గన.. చంద్రబాబు పాల్లొన్నది యూఎన్‌వోలో కాదనీ, ఎస్‌ఐఎఫ్‌ఎఫ్‌ అనే స్వచ్ఛంద సంస్థ మీటింగ్‌లో అని తెలిపారు. న్యూయార్క్‌ టైమ్స్‌కి ప్రృకృతి వ్యవసాయానికి 1400 కోట్లు కేటాయించామనీ, ఇంకా 16 వేల 600 కోట్ల రూపాయలు అప్పు కావాలని గతంలో చెప్పిన చంద్రబాబు ఏపీ ప్రజలను అప్పుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. అప్పుల కోసమే బాబు అమెరికా వెళ్లారనీ, అప్పుల కోసమే ఎస్‌ఐఎఫ్‌ఎఫ్‌తో చేతులు కలిపారని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories