ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేకుటుంబంలో విషాదం..

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేకుటుంబంలో విషాదం..
x
Highlights

అతివేగం వారి కుటుంబంలో విషాదం నింపింది. వేగంగా ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. దీంతో ఒకేకుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. ఈ...

అతివేగం వారి కుటుంబంలో విషాదం నింపింది. వేగంగా ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. దీంతో ఒకేకుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. ఈ ప్రమాదం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కాట్నపలి వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే మంథనికి చెందిన అకుల వరుణ్‌, సౌమ్య వారి ఇద్దరు పిల్లలు అఖిలేష్‌ కుమార్‌(10), శాన్వి(08)లు హైదరాబాద్‌ నుంచి మంథనికి బయలుదేరారు. మార్గంమధ్యలో అతివేగం కారణంగా కారు కంట్రోల్ తప్పి ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమందంలో నలుగురు కుటుంబసభ్యులు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories