logo
జాతీయం

మరోసారి బరితెగించిన పాకిస్థాన్‌!

మరోసారి బరితెగించిన పాకిస్థాన్‌!
X
Highlights

కాల్పుల విరమణ ఒప్పందానికి మరోసారి పాకిస్థాన్ తూట్లు పొడిచింది. దొంగచాటున భారత్ శిబిరంపై దాడి చేసి జవాన్ల...

కాల్పుల విరమణ ఒప్పందానికి మరోసారి పాకిస్థాన్ తూట్లు పొడిచింది. దొంగచాటున భారత్ శిబిరంపై దాడి చేసి జవాన్ల ప్రాణాలు తీసింది. జమ్మూకశ్మీర్‌ సాంబా జిల్లాలోని చామ్‌లియాల్‌ ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దుల్లో మీదుగా పాక్‌ మంగళవారం రాత్రి ఈ దాడికి పాల్పడింది. బీఎస్‌ఎఫ్‌ బలగాలు అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా రాత్రిపూట గస్తీ కాస్తుండగా.. పాక్‌ రేంజర్లు ఇలా బరితెగించి ఏకపక్షంగా జరిపిన కాల్పుల్లో భారత్ కు చెందిన అసిస్టెంట్‌ కమాండెంట్‌ జతిందర్‌ సింగ్‌, అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రామ్‌ నివాస్‌, కానిస్టేబుల్‌ హన్స్‌ రాజ్‌లు అమరులయ్యారు. మరో జవాను చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతిచెందారు.

Next Story