పార్సిల్ పంపించి.. రూ.36,900కు నామం పెట్టింది..

పార్సిల్ పంపించి.. రూ.36,900కు నామం పెట్టింది..
x
Highlights

రోజు రోజుకు ఆన్ లైన్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ఫోన్లకు సందేశాలు పంపి మీకు బహుమతి తగిలింది.. సొంతం చేసుకోవాలంటే పలానా అకౌంట్ కు కొంత నగదు...

రోజు రోజుకు ఆన్ లైన్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ఫోన్లకు సందేశాలు పంపి మీకు బహుమతి తగిలింది.. సొంతం చేసుకోవాలంటే పలానా అకౌంట్ కు కొంత నగదు పంపించాలని చెబుతారు. తీరా చూస్తే అందులో బహుమతి ఉందదు.. ఈ తరహా మోసాలు అప్పుడప్పుడు వింటూనే ఉన్నాం.. దాంతో మోసగాళ్లు రూటు మార్చారు. ప్రస్తుతం సామజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, వాట్సప్‌ లతో అమాయకులను మోసం చేస్తున్నారు. ఇటీవల ఈ తరహా మోసం వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఫేస్‌బుక్‌లో లండన్‌కు చెందిన యువతి పరిచయమైంది. దాంతో ఒకరికొకరు సందేశాలు పంపుకున్నారు. తరువాత ఆ వ్యక్తిని విదేశీ యువతి ఫోన్‌ నంబర్‌ అడిగింది. దీంతో ఇద్దరూ వాట్సప్‌లో చాటింగ్‌ చేసుకోవడం ప్రారంభించారు. కొద్దిరోజులకే ఆ వ్యక్తి తన ఇంటి అడ్రస్‌ను విదేశీ యువతికి వెల్లడించారు.

ఈ క్రమంలో తన పుట్టినరోజు సందర్బంగా 'నీకు గిఫ్టుపంపిస్తున్నా.. స్వీకరించు' అని చాటింగ్‌ చేసింది. అందులో ఆపిల్‌ఫోన్, బంగారుగొలుసు, ల్యాప్‌టాప్, షూ, గడియారం తదితర వస్తువులు సుమారు 50,000 వేల బ్రిటీష్‌ఫౌండ్లు పంపిస్తు న్నట్లు ఫోటోలు తీసి.. కొరియర్‌రశీదు వాట్సప్‌ చేసింది. ఈనెల 13న స్వైప్‌ ఎక్ర్‌ప్రెస్‌ కొరియర్‌ పేరుతో ఓ పార్సిల్‌ వచ్చినట్లు ఢిల్లీ నుంచి ఫోన్‌ వచ్చింది. అంతే ఆ వ్యక్తి ఎగిరి గంతేసి ఢిల్లీ చేరుకున్నాడు. సదరు పార్సిల్ కార్యాలయంలో విచారించగా రూ.36,900 చెల్లించి తీసుకెళ్లామన్నారు. దాంతో అతను అంత మొత్తం చెల్లించి పార్సిల్ తెచ్చుకున్నాడు.. తీరా చూస్తే అందులో యువతి చెప్పిన వస్తువులేవి లేవు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ వ్యక్తి వెంటనే సదరు యువతి వాట్సప్‌ నంబర్‌ బ్లాక్‌చేసి, ఫేస్‌బుక్‌లో అన్‌ఫ్రెండ్‌ చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories