తెలంగాణలో త్వరలోనే మరో డీఎస్సీ

x
Highlights

అన్ని ఉద్యోగాల భర్తీ టీఎస్‌పీఎస్సీ ద్వారానే జరుపుతామన్న సీఎం కేసీఆర్ ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గారు. ఎన్నికల ముందు నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న...

అన్ని ఉద్యోగాల భర్తీ టీఎస్‌పీఎస్సీ ద్వారానే జరుపుతామన్న సీఎం కేసీఆర్ ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గారు. ఎన్నికల ముందు నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను గుర్తించిన సీఎం.. గురుకుల టీచర్ల భర్తీకి కొత్త బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వచ్చే విద్యా సంవత్సరానికి కొత్త బోర్డు ద్వారా 628 పోస్టులు భర్తీ చేయనుంది. దీంతో మిగతా శాఖల్లోనూ ఇదే పద్ధతిలో నియామకాలు చేపట్టవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గతంలోని నియామక విధానాలను తొలగించి టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు. అన్నట్టుగానే అన్ని శాఖల ఉద్యోగాల భర్తీ బాధ్యతను టీఎస్‌పీఎస్సీకి అప్పగించారు. అయితే టీఎస్‌పీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్స్‌లో ఏదో ఒక తప్పు దొర్లడం.. దానిపై నిరుద్యోగులు, ప్రతిపక్షాలు ఉద్యమించడం పరిపాటిగా మారింది. రాబోయేది ఎన్నికల సంవత్సరం. నిరుద్యోగుల్లో పెరుగుతున్న వ్యతిరేకతను గుర్తించిన ప్రభుత్వం తన నిర్ణయంపై వెనక్కి తగ్గింది. ముందుగా ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గురుకుల పాఠశాలల్లో నియామకాలను చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా కొత్త బోర్డును నియమించింది. ఈ బోర్డు వచ్చే విద్యా సంవత్సరానికి 628 పోస్టుల భర్తీతో పని ప్రారంభించనుంది.

వైద్య, విద్యుత్, పోలీస్ రంగాలు ఇలా ఒక్కొక్కటిగా సంబంధిత శాఖల ద్వారానే ఉద్యోగాల భర్తీ చేయాలన్నది సీఎం ఆలోచనగా చెబుతున్నారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా అన్ని ఉద్యోగాల భర్తీ నిర్ణయం తప్పిదమని ఇన్నాళ్లకు తెలుసుకున్న ప్రభుత్వం.. దానిని దిద్దుకొనేందుకు కొత్తగా బోర్డుల నాటకం మొదలు పెట్టిందని విద్యార్థి సంఘాల నాయకులు, ప్రతిపక్ష నేతలు అరోపిస్తున్నారు. అవినీతికి తావియ్యకుండా నియామకాలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories