పాత కేసులు తిరగదోడితే... తిరగబడేదెవరు?

పాత కేసులు తిరగదోడితే... తిరగబడేదెవరు?
x
Highlights

ఎన్నిక‌ల్లో కోడ్ ఉల్లంఘ‌న‌కు పాల్పడితే క‌ఠిన చ‌ర్యలుంటాయి. ఈసీ సీరియస్‌గా కేసులు నమోదు చేస్తుంది. శిక్షలు కూడా కఠినంగానే ఉంటాయి. నిజంగానే, తాజ‌ాగా...

ఎన్నిక‌ల్లో కోడ్ ఉల్లంఘ‌న‌కు పాల్పడితే క‌ఠిన చ‌ర్యలుంటాయి. ఈసీ సీరియస్‌గా కేసులు నమోదు చేస్తుంది. శిక్షలు కూడా కఠినంగానే ఉంటాయి. నిజంగానే, తాజ‌ాగా మోడ‌ల్ కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత, అనేక కేసులు ఫైల్‌ అయ్యాయి. ఎన్నికల కోడ్, కేసులు, ధనం, మద్యం పట్టివేతలు సరే...మరి నిజంగానే చర్యలుంటాయా...2014 ఎన్నికల్లో నమోదైన కేసుల సంగతేంటి?

ఎప్పుడైనా తప్పు చేస్తే వెంట‌నే చ‌ర్యలు తీసుకుంటేనే..మ‌రొకసారి త‌ప్పుడు ప‌నుల జోలికి వెళ్ళరు. కానీ వాటిని ఏళ్లతరబడి నాన్చుతుంటే, ప‌ట్టించుకోకుండా వ‌దిలిస్తే అస‌లు కేసు అంటు ఒక‌టి ఉంటుంది అనే భ‌య‌మే ఉండ‌దు. స‌రిగ్గా ఇప్పుడు అదే జ‌రుగుతోంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో. 2014 ఎన్నిక‌ల్లో కోడ్ వాయిలేష‌న్ కింద అనేక కేసులు న‌మోదయ్యాయి. ఎంతో మందిపై కేసులు వేశారు. భారీగా న‌గ‌దు, బంగారం వంటివి సీజ్ చేశారు. కానీ వాటిల్లో శిక్షలు వేసింది ఎన్నింటికి అంటే..వేళ్ళ మీద లెక్కపెట్టే పరిస్థితి ఉంద‌ని స్వయంగా ఎన్నిక‌ల అధికారులే అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత, పోలీసులు 31.41 కోట్ల నగదు, కోటి విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు.

స‌హ‌జంగా ఎన్నిక‌ల కేసులంటేనే పొలిటిక‌ల్ కేసులు అంటారు. కేసులు మోపిన త‌ర్వాత ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుందో, ఆ పార్టీకి చెందిన వారిపై రిజిస్టర్ అయిన కేసులున్ని దాదాపు ర‌ద్దైన‌ట్లే. ఇక ప్రతిప‌క్షాల‌కు చెందిన వాటి ప‌రిస్థితి కూడా దాదాపుగా అంతే సంగ‌తులు. ఎందుకంటే రాజ‌కీయ ప‌రిణ‌మాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియ‌దు క‌నుక‌. అయితే స్వతంత్ర అభ్యర్ధులు, సామాన్యులపై పెట్టిన కేసులపై మాత్రం, ఈసీ కాస్త సీరియ‌స్‌గానే ఉంటుందన్న ఆరోపణలున్నాయి. ఇదిలావుంటే 2014 ఎన్నిక‌ల్లో భారీగా న‌గ‌దుతో పాటు మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేస్తున్న స‌మ‌యంలో, మద్యంతో పాటు..వాటికి ఉప‌యోగించిన వాహనాలను కూడా సీజ్ చేశారు. అంతే కాకుండా మ‌హిళ‌ల‌ను ఆక‌ర్షించేందుకు బంగారం వ‌స్తువులు కూడా పంపిణి చేస్తూ ప‌ట్టుబడ్డారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనల కేసులు, అంత తొందరగా ముగింపుకు రావు. సభకు ఎన్నికైన శాసనసభ్యులకు వ్యతిరేకంగా ఉంటే, చిన్నపాటి శిక్ష లేదా జరిమానా విధించటంతో, ఫైళ్లు మూసేస్తారు.

ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా, అన్ని పార్టీలకూ ఇందులో పాత్ర ఉంది. ప్రలోభాలకు పాల్పడితేనే, గెలుస్తామన్న ఆలోచనతో, కోట్ల రూపాయలను కుమ్మరిస్తున్నారు అభ్యర్థులు. జనం కూడా, ఇందుకు ఆమోదిస్తుండటం, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంో పడేస్తోంది. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్‌, కోడ్‌ ఉల్లంఘనలు, డబ్బు, మద్యం పంపిణీ, సీజ్‌పై సీిరియస్‌గా దృష్టిపెట్టాలని....సామాజికవేత్తలు విజ్తప్తి చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories