ఒకరితో తాళి.. మరొకరితో ప్రేమపెళ్లి.. ఇంకో వ్యక్తితో జంప్..

ఒకరితో తాళి కట్టించుకుని రెండు రోజులు కాపురం చేసింది. ఆ తర్వాత ప్రేమించిన వ్యక్తి వద్దకు వెళ్ళింది. అతనితో ఐదు ...
ఒకరితో తాళి కట్టించుకుని రెండు రోజులు కాపురం చేసింది. ఆ తర్వాత ప్రేమించిన వ్యక్తి వద్దకు వెళ్ళింది. అతనితో ఐదు రోజుల పాటు సంసారం చేసింది. చివరకు అతను కూడా నచ్చలేదని పేర్కొంటూ మరో వ్యక్తిని తీసుకుని పారిపోయింది. ఈ ఘటన ఒడిషా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే..కోరాపుట్ జిల్లాకు చెందిన ఓ యువతికి పెద్దలు అదేప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి చేశారు. అతనితో రెండు రోజులపాటు కాపురం చేసింది. ఆ తర్వాత తాను ఒక యువకుడిని ప్రేమించానని తల్లిదండ్రులతో, కట్టుకున్న భర్తతో తెగేసి చెప్పి పోలీసుల సమక్షంలో ప్రేమికుని మెడలో పూల దండలు వేసింది. అతనితో మరో ఏడడుగులు వేసింది. ఇతడితో కేవలం ఐదు రోజులు మాత్రమే సంసారం చేసింది. ఆ తర్వాత మరో వ్యక్తితో జంప్ అయింది. ఇది కొరాపుట్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
దీంతో పోలీసుల సమక్షంలో ఆమె మెడలో పూల దండ వేసి పెళ్లి చేసుకున్న ఆమె ప్రియుడైన రెండవ భర్త తన భార్య కనిపించడం లేదని స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆమె ఒక యువకుని సైకిల్ ఎక్కి వెళ్లిపోయినట్టు అతని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఆమె ఎక్కడకు వెళ్లింది? ఎందుకు వెళ్లింది? ఆమె మనసులో ఏముంది అనేది మాత్రం తెలియడంలేదు. దీంతో అన్ని పోలీస్ స్టేషన్లుకు ఆమె ఫొటోలు పంపి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT