logo
జాతీయం

‘మీ టూ’ ఎఫెక్ట్.. కాంగ్రెస్ కీలక నేత రాజీనామా

‘మీ టూ’ ఎఫెక్ట్.. కాంగ్రెస్ కీలక నేత రాజీనామా
X
Highlights

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మీ టూ ఉద్యమం… అన్ని రంగాలనూ కుదిపేస్తోంది. హాలీవుడ్‌ నుంచి మొదలైన ఉద్యమం...

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మీ టూ ఉద్యమం… అన్ని రంగాలనూ కుదిపేస్తోంది. హాలీవుడ్‌ నుంచి మొదలైన ఉద్యమం బాలీవుడ్‌, టాలీవుడ్‌ అనే తేడా లేకుండా అన్ని చోట్లా ప్రకంపనలు సృష్టిస్తోంది. సినిమాలకే పరిమిమతమనుకున్న ఈ వ్యవహారం.. రాజకీయాలనూ తాకింది. చత్తీస్‌ గఢ్‌కు చెందిన ఒక మహిళా కాంగ్రెస్‌ కార్యకర్త.. తన పట్ల NSUI జాతీయ అధ్యక్షుడు ఫిరోజ్‌ఖాన్‌ అసభ్యంగా ప్రవర్తించారని గతంలో ఆరోపణలు చేసింది. పైగా ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో దాంతో ఫిరోజ్‌ ఖాన్‌ తన పదవికి రాజీనా చేశారు. ఆయన రాజీనామాను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆమోదించారు. కాంగ్రెస్‌ పార్టీకి అప్రతిష్ట రాకూడదనే భావంతోనే.. తాను రాజీనామా చేసినట్టు ఫిరోజ్‌ఖాన్‌ చెప్పారు.

Next Story