logo
జాతీయం

సంచలన నిర్ణయం తీసుకున్న రైల్వే.. ఇకపై అలా చేస్తే..

సంచలన నిర్ణయం తీసుకున్న రైల్వే.. ఇకపై అలా చేస్తే..
X
Highlights

మంగళవారం రైల్వే శాఖా సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటికే అమలులో ఉన్న నిబంధనలు సడలించి కాస్త...

మంగళవారం రైల్వే శాఖా సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటికే అమలులో ఉన్న నిబంధనలు సడలించి కాస్త స్ట్రిక్ట్ గా అమలుపరచబోతోంది. 30 ఏళ్లుగా అమలవుతున్న లగేజీ చార్జెస్ ను సడలించి వాటి స్థానంలో కొత్త నిబంధన అమలపరుస్తోంది. అంతేకాకుండా అదనపు లగేజి క్యారీ చేసే వారిపై కొరడా ఝళిపిస్తోంది.

రైల్వే సూచించిన నిబంధనల ప్రకారం, స్లీపర్ క్లాస్ ప్రయాణీకులు 40 , సెకండ్ క్లాస్ ప్రయాణీకులు 30 కిలోల బరువుగల లగేజీని ఉచితంగానే తీసుకెళ్లవచ్చు. ఒకవేళ అంతకుమిచితే స్లీపర్ క్లాస్ ప్రయాణికుల లగేజి 80 కేజీలు, సెకండ్ క్లాస్ ప్రయాణీకులు 70 కిలోల వరకు టికెట్ తోపాటు అదనపు చార్జెస్ పే.. చేయాల్సి ఉంటుంది. ఇవి కూడా అదనపు సామాన్ల వ్యానులో పెట్టాలని చెబుతోంది.

ఇలా కాకుండా అనుమతిలేకుండా పరిమిత బరువుకంటే ఎక్కువ క్యారీ చేసినవారు తగిన మూల్యం చెలించుకోవలసిందే. అటువంటివారికి సాధారణంగా విధించే చార్జెస్ కంటే ఆరురేట్లు ఫైన్ విధించబడుతోందని డైరెక్టర్ అఫ్ ఇన్ఫర్మేషన్ మరియు పబ్లిసిటీ , రైల్వే బోర్డు అధికారి ప్రకాష్ వెల్లడించారు.

ఉదాహరణకు ఒక స్లీపర్ క్లాస్ ప్రయాణికుడు 80 కిలోల లగేజీతో 500 కి.మీ. ప్రయాణిస్తే.. 40 కిలోల వరకు చార్జీ ఉండదు. అదనపు 40 కిలోల లగేజీకోసం రూ.109 చెల్లిస్తే సరిపోతుంది. తనిఖీలలో అదనపు లగేజీతో పట్టుబడితే ఆరురెట్లు అంటే రూ.654 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

Next Story