కాస్త ఆలస్యం కానున్న తెలంగాణ పంచాయతీ ఎన్నికలు

x
Highlights

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు కాస్తా ఆలస్యమయ్యేలా ఉన్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియ ఆలస్యం అవుతుండడంతో హై కోర్టు విధించిన గడువు కంటే పది లేదా పదిహేను రోజులు...

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు కాస్తా ఆలస్యమయ్యేలా ఉన్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియ ఆలస్యం అవుతుండడంతో హై కోర్టు విధించిన గడువు కంటే పది లేదా పదిహేను రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. జనవరి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావొచ్చు. తెలంగాణ పంచాయతీ ఎన్నికలు వచ్చేజనవరి పదిలోపు పూర్తి చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. పంచాయతీల రిజర్వేషన్లు ఖరారుకు మరో పది రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ మాత్రమే విడుదలయ్యే అవకాశం ఉంది. కానీ కోర్టు విధించిన గడువు లోగా ఎన్నికలు పూర్తయ్యేలా లేవు. రెండు మూడు రోజుల్లో బీసీ జనాభా లెక్కలు ఇవ్వాలని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది. బీసీ జనాభా లెక్కలు అందిన తర్వాత వార్డు, సర్పంచ్ ల రిజర్వేషన్లను డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జనవరి ఐదు తర్వాతే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పంచాయతీల రిజర్వేషన్లను 50 మించరాదని ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీలకు 26 శాతం, బీసీలకు 24 శాతం రిజర్వేషన్లుఅమలు చేయనున్నారు. 31 జిల్లాల ప్రాతిపదికన పంచాయతీ రిజర్వేషన్లు, ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 500 జనాభా దాటిన గిరిజన తండాలు, గూడాలను ప్రత్యేక పంచాయతీలుగా ప్రకటించారు. వీటిని పూర్తిగా గిరిజనులకే రిజర్వేషన్ కల్పించారు. బి.సి. రిజర్వేషన్ల గైడ్ లైన్స్ రెండు మూడు రోజుల్లో రానుంది. పంచాయతీల్లో రిజర్వేషన్ల ప్రక్రియ ఆలస్యం కానుండడంతో హై కోర్టు విధించిన గడువు కంటే పది లేదా పదిహేను రోజులు ఆలస్యం కానుంది. జనవరి మొదటివారంలో ఎన్నికలు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories