ఎనిమిదేళ్ల చిన్నారి అత్యాచారంపై నిన‌దించ‌డం త‌ప్పా

ఎనిమిదేళ్ల చిన్నారి అత్యాచారంపై నిన‌దించ‌డం త‌ప్పా
x
Highlights

ముక్కుప‌చ్చ‌లార‌ని ఎనిమిది నెల‌ల చిన్నారిపై అత్యాచారం చేస్తే దాన్ని నిన‌దించ‌డం నేను చేసిన త‌ప్పా అంటూ బాలీవుడ్ న‌టి ష‌హ‌నే సోష‌ల్ మీడియాలో ఓ...

ముక్కుప‌చ్చ‌లార‌ని ఎనిమిది నెల‌ల చిన్నారిపై అత్యాచారం చేస్తే దాన్ని నిన‌దించ‌డం నేను చేసిన త‌ప్పా అంటూ బాలీవుడ్ న‌టి ష‌హ‌నే సోష‌ల్ మీడియాలో ఓ భావోద్వేగ‌పు పోస్ట్ చేశారు.
కొద్దిరోజుల క్రితం దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ఎనిమిదినెల‌ల చిన్నారిపై 28యవ‌కుడు అత్యంత హేయంగా అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అయితే స్థానికుల స‌మాచారంతో చిన్నారి ఆస్ప‌త్రికి త‌ర‌లించి వైద్య సేవ‌లు అందించారు. సుమారు మూడుగంట‌ల పాటు ఆ చిన్నారికి ఆప‌రేష‌న్ చేసిన వైద్యులు ప్రాణం పోశారు. ఈ ఘ‌ట‌న‌పై క‌న్నీటి ప‌ర్యంత‌మైన ష‌హ‌నే ఇప్పటికీ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ చిట్టితల్లిని మనమే ఆదుకోవాలి అంటూ ‘అత్యాచారాన్ని నిషేధించాలి‌’, ‘లైంగిక వేధింపులను అరికట్టాలి’, ‘ఆడపిల్లల భ్రూణ హత్యలను నిషేధించాలి’ అని ఈ మూడు స్లోగ‌న్స్ ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ల‌పై స్పందించిన కొంత‌మంది నెటిజ‌న్లు ఎగ‌తాళి చేస్తూ కామెంట్లు చేశార‌ని క‌న్నీటి ప‌ర్యంత‌మైంది.
ఓ చిన్నారి మృగాళ్ల చేతిలో బ‌లై ఆస్ప‌త్రిలో చావుబ‌తుకుల మ‌ధ్య‌కొట్టాడుతుంటే స్పందించ‌క‌పోవ‌డం త‌న‌ని ఆవేధ‌న‌కు గురిచేసిందని అన్నారు. ప్ర‌స్తుతం రాహుల్ గాంధీ జాకెట్ , క‌స్గంగ్ అల్ల‌ర్లు, స‌ర్వాభాస్క‌ర్ లేక‌పై స్పందిస్తున్నారే త‌ప్ప ఆ చిన్నారి గురించి ఎవ‌రు ప‌ట్టించుకోక‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు.
క‌ర్ణిసేన రాణి ప‌ద్మావ‌తిగురించి ఆందోళ‌న చేసిందే త‌ప్పా ఆ పసికందు గురించి ఒక్కరు నోరువిప్పలేదు. ఇక ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు ప‌ద్మావ‌త్ విజ‌యం , ప్యాడ్ మెన్ ప్ర‌చారంతో బిజీ అయిపోయారు. ఇంకొంత మంది శానిటరీ న్యాప్‌కిన్లు పట్టుకుని మరీ ఫొటోలకు పోజులిస్తున్నారు. అంటే అత్యాచారానికి గురైన ఎనిమిది నెలల చిన్నారి కూడా ఈ శానిటరీ న్యాప్‌కిన్‌ను ఉపయోగించాలా? అసలు ఆ చిట్టితల్లి పట్ల ఇంత దారుణం ఎందుకు జరిగింది? రెచ్చగొట్టే విధంగా అసభ్యకర దుస్తులేమన్నా ధరించిందా? రాత్రిళ్లు రోడ్లపై తిరుగుతోందా? ఏళ్ల క్రితం జరిగిన కథను సినిమాగా తెరకెక్కిస్తే ఆందోళనలు చేశారు కానీ ఇంతటి దారుణం జరిగితే మాత్రం ఏమీ జరగనట్లు ప్రవర్తిస్తున్నారు. ఆ చిన్నారి కోసం మీరేమన్నా చేయాలనుకుంటే వెబ్‌సైట్‌ ద్వారా మీకు తోచినంత డబ్బు సాయం చేయండి. అత్యాచారాలను నిషేధించలేనప్పుడు కనీసం బాధితులకైనా సాయం చేద్దాం. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’ అని రేణుక పోస్ట్‌లో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories