Top
logo

99 రూపాయలకే స్మార్ట్‌ఫోన్‌

99 రూపాయలకే స్మార్ట్‌ఫోన్‌
X
Highlights

నోకియా స్మార్ట్‌ఫోన్లను విక్రయిస్తున్న హెచ్‌ఎండీ గ్లోబల్‌ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌...

నోకియా స్మార్ట్‌ఫోన్లను విక్రయిస్తున్న హెచ్‌ఎండీ గ్లోబల్‌ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. కేవలం 99 రూపాయల డౌన్‌పేమెంట్ లో నోకియా బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్లను ఆఫర్ చేస్తోంది. రూ. 99 డౌన్‌పేమెంట్ కట్టి మిగతా మొత్తాన్ని నో – కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌లో నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్‌ల రూపంలో చెల్లించుకోవచ్చని హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ఆఫర్ 2018 నవంబర్‌ 10 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ఆఫర్ ను పొందాలనుకునే వారు దగ్గరలోని రిలయన్స్‌ జియో, జియో డిజిటల్‌ లైఫ్, క్రోమా స్టోర్‌లలో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు ఎంక్వయిరీ చేసుకోవచ్చు. అలాగే నోకియా ఆన్‌లైన్‌ స్టోర్‌లో కూడా ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని హెచ్‌ఎండీ గ్లోబల్‌ తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డులపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ అందుబాటులో ఉండగా.. ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ నోకియా 8 సిరాకో పై హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుదారులకు 15 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తోంది. రూ.99కే అందుబాటులో ఉన్న ఫోన్లు… నోకియా 1, నోకియా 2.1, నోకియా 5.1, నోకియా 6.1, నోకియా 3.1 ప్లస్, నోకియా 8 సిరాకో. నోకియా 3.1ప్లస్‌ ఫోన్లు.

Next Story