రాఫెల్‌ కేసులో మోదీ సర్కార్‌కు ఊరట

రాఫెల్‌ కేసులో మోదీ సర్కార్‌కు ఊరట
x
Highlights

రఫెల్ యుద్ధవిమానాల కోనుగోలు కేంద్రానికి పెద్ద ఊరట దక్కింది. రఫెల్ డీల్‌లో కేంద్రం కొనసాగిస్తున్న రహస్య ఒప్పందాలను సుప్రీం కోర్టు సమర్ధించింది. దేశ...

రఫెల్ యుద్ధవిమానాల కోనుగోలు కేంద్రానికి పెద్ద ఊరట దక్కింది. రఫెల్ డీల్‌లో కేంద్రం కొనసాగిస్తున్న రహస్య ఒప్పందాలను సుప్రీం కోర్టు సమర్ధించింది. దేశ రక్షణ దృష్యా ఇలాంటి ఒప్పందాలను రహస్యంగానే ఉంచాలని న్యాయస్ధానం అభిప్రాయపడింది. కేసును విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం రఫెల్ ‌డీల్‌పై ఎలాంటి దర్యాప్తులు అవసరం లేదని తేల్చి చెప్పింది. విచారణ కోరుతూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ విషయంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమంటూ కోర్టు తేల్చిచెప్పింది.

రఫెల్ డీల్‌లో రహస్య ఒప్పందాల మాటున భారీ అవినీతి జరిగిందంటూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో కొనుగోలు ఒప్పందాలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన జస్టిస్‌ రంజన్‌ గొగొయి పలు మార్లు విచారించారు. కొనుగోలు వివరాలను సీల్డ్ కవర్‌లో అందజేయాలంటూ ఆదేశించింది. సుప్రీం ఆదేశం మేరకు సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించిన కేంద్రం వివరాలను బహిర్గతం చేయాలంటూ కోర్టును కోరింది. ఈసందర్భంగా అటార్ని జనరల్ రాజ్యాంగ పరమైన పలు అంశాలను లేవనెత్తారు. వ్యూహాత్మక రక్షణ ఒప్పందాల్లో భాగంగా గోప్యతతో కూడిన ఒప్పందాలు చేసుకున్నట్టు కోర్టుకు వివరించారు. రాజ్యాంగ పరంగా లభించిన అధికారంతో శాసనశాఖ ఈ ఒప్పందం చేసుకుందంటూ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్ధానం చివరకు కేంద్రం వాదనతోనే ఏకీభవించింది. జాతి రక్షణ ప్రయోజనాల దృశ్యా ఇలాంటి ఒప్పందాల్లో జోక్యం చేసుకోలేమంటూ తేల్చి చెప్పింది. సుప్రీం తీర్పును స్వాగతించిన బీజేపీ కాంగ్రెస్‌కు ఇది చెంప పెట్టులాంటిదన్నారు. రోజుకో మాట పూటకో బాట చెప్పే కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా దేశ ప్రయోజనాల గురించి ఆలోచించాలంటూ హితవు పలికారు .

సుప్రీం తీర్పుపై న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ఈ వ్యవహారంలో రక్షణ వ్యవహారాలు, రహస్య ఒప్పందాలపై మాత్రమే కోర్టు తీర్పునిచ్చిందన్నారు. యూపీఏ హయంలో 126 యుద్ధ విమానాలకు కుదుర్చుకున్న ఒప్పందం ప్రధాని ఫ్రాన్స్ పర్యటన తరువాత 36 విమానాలకు ఎందుకు తగ్గించారనే దానిపై తాము ప్రశ్నించారు. దీనిపై తమ పోరాటం కొనసాగుతుందని ఆయన అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories