logo
సినిమా

'మ‌హానుభావుడు'కి నో క‌ట్స్‌

మ‌హానుభావుడుకి నో క‌ట్స్‌
X
Highlights

'గ‌మ్యం', 'ప్ర‌స్థానం', 'మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు', 'ర‌న్ రాజా ర‌న్‌', 'ఎక్స్ ప్రెస్‌ రాజా', 'శ‌త‌మానం...

'గ‌మ్యం', 'ప్ర‌స్థానం', 'మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు', 'ర‌న్ రాజా ర‌న్‌', 'ఎక్స్ ప్రెస్‌ రాజా', 'శ‌త‌మానం భ‌వతి' చిత్రాల‌తో ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోగ‌ల న‌టుడు అని పేరు తెచ్చుకున్నాడు శ‌ర్వానంద్‌. ఈ యువ క‌థానాయ‌కుడి నుంచి వ‌స్తున్న తాజా చిత్రం 'మ‌హానుభావుడు'. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసుకుంది.

ఎలాంటి క‌ట్స్ లేకుండా యు/ఎ స‌ర్టిఫికేట్‌ని సొంతం చేసుకున్న ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా ఈ నెల 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 'కృష్ణ‌గాడి వీరప్రేమ‌గాథ' ఫేమ్ మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీత‌మందించారు. ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది.

Next Story