తిరుపతిలో ఢభేల్‌ మన్న దీపావళి వ్యాపారం...వెలవెలబోతున్న బాణాసంచా దుకాణాలు

తిరుపతిలో ఢభేల్‌ మన్న దీపావళి వ్యాపారం...వెలవెలబోతున్న బాణాసంచా దుకాణాలు
x
Highlights

బాణాసంచా వ్యాపారంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న తిరుపతిలో క్రాకర్స్‌ బిజినెస్‌ ఒక్కసారి డభేల్‌ మంది. జీఎస్టీ బాదుడు ఎక్కువవడంతో కొనేవారు...

బాణాసంచా వ్యాపారంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న తిరుపతిలో క్రాకర్స్‌ బిజినెస్‌ ఒక్కసారి డభేల్‌ మంది. జీఎస్టీ బాదుడు ఎక్కువవడంతో కొనేవారు కరువై వ్యాపారాలు కుదేలయ్యాయి. పొల్యూషన్‌ పై అవేర్‌నెస్‌ పెరగడంతో కొనుగోళ్లు పూర్తిగా పడిపోయాయి. దీంతో కొనేవారు లేక దుకాణాలు వెళవెళబోతున్నాయి. పోటీలు పడి మరీ బాణాసంచాను కాల్చే జనం క్రమంగా తగ్గుతూ వస్తున్నారు. పర్యావరణంపై పెరుగుతున్న అవగాహనకు తోడు సుప్రీం తీర్పు వంటి అంశాలతో క్రాకర్స్‌ కొనేందుకు చాలామంది జనం ఇష్టపడటం లేదు. తిరుపతిలో మొత్తం మూడు ప్రాంతాల్లో టపాకాయల దుకాణాలను నిర్వహించేందుకు అనుమతులిచ్చారు. తమిళనాడులోని పల్లికట్టు, శివకాశి నుంచి తీసుకొచ్చిన పటాసులను ఇక్కడ అమ్ముతుంటారు. అయితే ట్యాక్సులు, లైసెన్సులతో పాటు జీఎస్టీ కట్టడం వంటి తలనొప్పులతో చాలామంది వ్యాపారులు దుకాణాలు ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. డబ్బులు పెట్టి పర్యావరణాన్ని పాడు చేయడం ఇష్టం లేదని కొనుగోలుదారులు అంటున్నారు. సంప్రదాయం ప్రకారం పిల్లల కోసం కొంటున్నామని చెబుతున్నారు. తమిళనాడుకు దగ్గరగా ఉండటంతో తిరుపతిలో హోల్‌సేల్‌ బిజినెస్‌ కూడా భారీగా జరిగేది. అయితే ఈ సారి బిజినెస్‌ పూర్తిగా పడిపోవడం వ్యాపారులకు మింగుడుపడటం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories