Top
logo

టీఆర్ఎస్‌లో అవిశ్వాసాల చిచ్చు..రామగుండం మేయర్‌పై అవిశ్వాసం

టీఆర్ఎస్‌లో అవిశ్వాసాల చిచ్చు..రామగుండం మేయర్‌పై అవిశ్వాసం
X
Highlights

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో నేతల మధ్య తలెత్తిన వివాదాలు ముదిరిపాకాన పడుతున్నాయి.. ఇవి చిలికి చిలికి...

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో నేతల మధ్య తలెత్తిన వివాదాలు ముదిరిపాకాన పడుతున్నాయి.. ఇవి చిలికి చిలికి గాలివానగా మారి.. పార్టీ పరువును బజారుకీడిస్తున్నాయి. మరి ముఖ్యంగా పురపాలక సంస్థలు, నగర పాలక సంస్థల్లో ఈ కోల్డ్‌వార్ బాగా ఎక్కువగా కనిపిస్తుంది. రామగుండం మేయర్‌పై కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లోని 50 మంది కార్పొరేటర్లలో 41 మంది కార్పొరేటర్లు మేయర్ లక్ష్మీనారాయణపై అవిశ్వాస తీర్మానం ప్రకటించి.. సంతకాలతో కూడిన లేఖను పెద్దపల్లి కలెక్టర్ దేవసేనకు అందించారు. ప్రస్తుతం ఉన్న మేయర్ వద్దని మార్చాలని కోరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మేయర్ ఇద్దరూ టీఆర్ఎస్ నేతలే. అక్కడ గ్రూప్ రాజకీయాలు రాజుకున్నాయి. దీంతో మేయర్‌పై అవిశ్వాసానికి దారితీసింది. దీని వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని సమాచారం. 4 రోజుల క్రితం మంత్రి కేటీఆర్ ఈ రెండు గ్రూపులను పిలిచి సమన్వయపరిచారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 మండలాలకు పైగా అవిశ్వాసం బాటలో పయనిస్తున్నాయి. వేములవాడ మండలంలో ఇదే పరిస్థితి నెలకొంది.

Next Story