logo
సినిమా

'కావ్యాస్ డైరీ' డైరెక్ట‌ర్‌తో నిత్యా

కావ్యాస్ డైరీ డైరెక్ట‌ర్‌తో నిత్యా
X
Highlights

పెర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర‌ల్లో క‌నిపించి మెప్పించిన నిత్యా మీన‌న్‌.. 'జ‌న‌తా గ్యారేజ్' త‌రువాత...

పెర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర‌ల్లో క‌నిపించి మెప్పించిన నిత్యా మీన‌న్‌.. 'జ‌న‌తా గ్యారేజ్' త‌రువాత మ‌ళ్లీ తెలుగు తెర‌పై క‌నిపించ‌నేలేదు. త‌మిళంలో నిత్యా న‌టించిన తాజా చిత్రం 'మెర్స‌ల్' దీపావ‌ళికి విడుద‌ల కాబోతోంది. తెలుగులో 'అదిరింది' పేరుతో ఈ సినిమా అనువాదం కానుంది. కాగా, తాజాగా నిత్యా ఓ మల‌యాళ చిత్రానికి ఓకే చెప్పింది. ప్ర‌ముఖ మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు వి.కె.ప్ర‌కాష్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

గ‌తంలో నిత్యా, వి.కె.ప్ర‌కాష్ కాంబినేష‌న్‌లో క‌న్న‌డ చిత్రం 'ఐదొండ్ల ఐదు', మ‌ల‌యాళ చిత్రాలు 'క‌ర్మ‌యోగి', 'పొపిన్స్‌' వ‌చ్చాయి. అలాగే మంజుల‌, ఛార్మి ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన 'కావ్యాస్ డైరీ'కి ప్ర‌కాష్‌నే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కాగా, ఈ చిత్రానికి ప్ర‌ముఖ ఛాయాగ్రాహ‌కుడు పి.సి.శ్రీ‌రామ్ కెమెరామేన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. మ‌రో రెండు రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డికానున్నాయి. నెల రోజుల్లో చిత్రీక‌ర‌ణ‌ని పూర్తిచేయాల‌ని చిత్ర‌బృందం ప్లాన్ చేసింది.

Next Story