logo
సినిమా

కొడుకు నిశ్చితార్థపు వేడుకల్లో సందడి చేసిన నీతూ

X
Highlights

కుబేరుడు ముఖేశ్‌‌ అంబానీ- నీతా ముద్దుల కొడుకు ఆకాశ్‌ అంబానీ, శ్లోకా మెహతాల ప్రీ-ఎంగేజ్‌మెంట్‌ వేడుకలు...

కుబేరుడు ముఖేశ్‌‌ అంబానీ- నీతా ముద్దుల కొడుకు ఆకాశ్‌ అంబానీ, శ్లోకా మెహతాల ప్రీ-ఎంగేజ్‌మెంట్‌ వేడుకలు కలర్‌ఫుల్‌గా సాగుతున్నాయి. అంబానీ గారాల పట్టి ఆ ఇంటి ఆడబిడ్డ ఇషా అంబానీ ఆకాశ్‌, శ్లోకాలకు హారతి పట్టగా ఈవెంట్‌లో మెరూన్‌ శారీలో నీతా అంబానీ తళుక్కున మెరిశారు. ఓ రేంజ్‌లో జరుగుతున్న కొడుకు నిశ్చితార్థపు వేడుకల్లో అదిరిపోయే స్టెప్పులతో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇటు ఆకాశ్‌ అంబానీ కూడా తన కాబోయే భార్య శ్లోకాతో కలిసి ఫోటోగ్రాఫర్లకు ఫోజులు ఇస్తూ తెగ సందడి చేశారు. అంబానీ ఫ్యామిలీ సందడి వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story