బ్యాట్‌... బ్యాండ్‌బాజా... నిఫా సఫా చేస్తానంటోంది!!

బ్యాట్‌... బ్యాండ్‌బాజా... నిఫా సఫా చేస్తానంటోంది!!
x
Highlights

అయ్య బాబోయ్ గబ్బిలాలు.....................దూసుకొస్తున్నాయ్. చిమ్మచీకట్లో బతికే, గబ్బిలాలంటే, మామూలుగానే భయం. వాటి అరుపులంటే, కీచులాటలంటే అదో చిరాకు....

అయ్య బాబోయ్ గబ్బిలాలు.....................దూసుకొస్తున్నాయ్. చిమ్మచీకట్లో బతికే, గబ్బిలాలంటే, మామూలుగానే భయం. వాటి అరుపులంటే, కీచులాటలంటే అదో చిరాకు. అవి తారసపడితే దరిద్రమన్న ఫీలింగ్. ఇంట్లోకొస్తే, ఇల్లు ఖాళీ చేయాలన్న మూఢనమ్మకం.గబ్బిలాలపై ఇలా రకరకాల భయాలు గూడుకట్టుకున్న తరుణంలో, ఈ నిశాచర జీవులు భయానక వ్యాధినే మోసుకొస్తున్నాయి. ప్రాణాలు తీసే మహమ్మారిని జనాలపైకి వదులుతున్నాయి. ఇంతకీ ఏంటా భయానక వ్యాధి అనుకుంటున్నారా....అదే నిపా వైరస్. జికా, ఎబోలా, స్వైన్‌ఫ్లూ వంటి ప్రాణాంతక వ్యాధుల తరహాలో, జనాల ప్రాణాలు తీస్తున్న వ్యాధి. కేరళలో ఇప్పటికే చాలామంది నిపా ఎఫెక్ట్‌తో చనిపోయారు. ఇందులో నర్సులు కూడా ఉన్నారు. మన హైదరాబాద్‌లోనూ రెండు అనుమానిత కేసులను వైద్యులు అబ్జర్వేషన్‌లో పెట్టారు. ఇంతకీ గబ్బిలాలు మోసుకొస్తున్న నిపా వైరస్‌ ఎలా వ్యాప్తి చెందుతుంది...దీని లక్షణాలేంటి...జాగ్రత్తలేంటి.?

జికా వైరస్‌ ప్రపంచాన్ని వణికించింది. ఎబోలా భ‍యపెట్టింది. జికా వైరస్‌ కంటి మీద కునుకులేకుండా చేసింది. ఇప్పుడు నిపా వైరస్‌...సఫా చేస్తానంటూ విరుచుకుపడతానంటోంది. పశ్చిమ బెంగాల్‌లో గతంలోనే పదుల సంఖ్యలో ప్రాణాలు తీసిన నిపా వైరస్, కేరళను వణికిస్తోంది. కర్ణాటకను కంగారుపెట్టిస్తోంది. తమిళనాడును భయపెడుతోంది. భాగ్యనగరంలోనూ రెండు నిపా వైరస్‌ అనుమానిత కేసులు నమోదు కావడం, నిజంగా ఆందోళన కలిగిస్తోంది.

మనదేశంలో నిపా కలవరం మొదలైంది మొదట కేరళలోనే. ఇప్పుడు అక్కడి నుంచే దేశమంతా విస్తరిస్తోంది. నిపా మహమ్మారి కొత్తది కాకపోయినా, ఇది ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా సోకుతుంది. ఒక్కసారి బాడీలోకి వైరస్‌ అటాక్‌ అయ్యిందంటే, చనిపోయే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే దీనికి మందులేదు. కేరళలో నిపా వైరస్‌ కారణంగా, ఇప్పటికే దాదాపు 11 మంది చనిపోయారు. వీరిలో ఓ నర్సు కూడా ఉంది. ఆమె పేరు లినీ. దేశమంతా ఆమె త్యాగాన్ని కొనియాడుతోంది. ఆమె చివరి మాటలను స్మరించుకుంటోంది. నిపా వైరస్‌ సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న సమయంలో నర్సు లినీకి కూడా ఆ వ్యాధి సోకింది. కొద్దిరోజుల్లోనే ఆమె ప్రాణాలు కోల్పోయారు. మరణానికి కొద్ది గంటల ముందు భర్తకు లినీ రాసిన లేఖ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది. ఒకరి నుంచి మరొకరికి నిపా వైరస్‌ సోకే ప్రమాదం ఉండటంతో కుటుంబసభ్యులకు కనీసం ఆఖరి చూపుకైనా లేకుండా, లినీ భౌతికకాయానికి దహనసంస్కారాలు నిర్వహించారు.

నిపా వైరస్‌ కారణంగా, కేరళ నిజంగా వణికిపోతోంది. కేరళలోని కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో పేషంట్లకు చికిత్స చేసిన నర్సులు, డాక్టర్లు కూడా ట్రీట్‌మెంట్‌ పొందుతున్నారు. మన హైదరాబాద్‌లోనూ నిపా వైరస్ ఎంటరైందన్న అనుమానాలు, ఆందోళన కలిగిస్తున్నాయి. ఇద్దరికి నిపా లక్షణాలున్నట్టు వైద్యులు భావిస్తున్నారు. వీరిలో ఒకరు కొద్దిరోజుల క్రితం కేరళ వెళ్లి వచ్చారు. ఇరువురి బ్లడ్‌ శాంపిల్స్‌ను వ్యాధి నిర్ధారణ కోసం పుణె నేషనల్‌ ఇనస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపారు. కేరళను వణికిస్తున్న నిపా వైరస్‌, భాగ్యనగరంలో తన ఉనికి చాటుకోవడంతో జనం భయపడుతున్నారు. హైదరాబాద్‌లోని టూరిజం ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే ఎలాంటి ఆందోళనా అవసరం లేదని, ప్రభుత్వాధికారులు కూడా చెబుతున్నారు. నిపా వైరస్‌ను ఎదుర్కోవడానికి యంత్రాంగం సిద్దంగా ఉందని భరోసా ఇస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories