కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు ఆత్మహత్య

కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు ఆత్మహత్య
x
Highlights

మూడుముళ్ల బంధం మూడురోజులకే ముగిసిపోయింది. కాళ్ల పారాణి సైతం ఆరకముందే నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం గంపనపల్లెలో...

మూడుముళ్ల బంధం మూడురోజులకే ముగిసిపోయింది. కాళ్ల పారాణి సైతం ఆరకముందే నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం గంపనపల్లెలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సరస్వతికి పెద్దపంజాణి మండలం రాయలపేట పంచాయతీ లింగమనాయునిపల్లెకు చెందిన మేనమామ జగదీశ్‌తో 12వ తేదీన వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ శుక్రవారం పుంగనూరులో సినిమాకు వెళ్లొచ్చారు.
అనంతరం సరస్వతి పుట్టింటికి వచ్చింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగా సరస్వతి బాత్‌రూంలోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పటించుకుంది. తీవ్రంగా గాయపడిన సరస్వతి కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వచ్చి మంటలను అదుపు చేసి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ సరస్వతి మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories