నకిలీ వేలిముద్రల స్కాంలో కొత్త కోణం

x
Highlights

నకిలీ వేలిముద్రల కేసు విచారణలో కొత్త కోణం వెలుగుచూసింది. ప్రధాన నిందితుడు సంతోష్‌కుమార్ రేషన్ డీలర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు తేల్చారు....

నకిలీ వేలిముద్రల కేసు విచారణలో కొత్త కోణం వెలుగుచూసింది. ప్రధాన నిందితుడు సంతోష్‌కుమార్ రేషన్ డీలర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు తేల్చారు. దీనికి సంబంధించి నలుగురు డీలర్లను అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా వీరంతా బియ్యం అక్రమంగా రవాణా చేసినట్లు గుర్తించారు. రెండోరోజు విచారణలో భాగంగా సంతోష్‌కుమార్‌ ను స్వగ్రామం ధర్మారంకు తరలించారు. ఆయన ఇళ్లు, దుకాణంలో దాడులు చేపట్టారు. కీలక ఆధారాల కోసం సోదాలు చేస్తున్నారు. మరోవైపు సంతోష్ కుమార్ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫేక్ ఫింగర్ ప్రింట్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కేంద్ర ఇంటెలిజెన్స్‌, సైబర్ క్రైమ్ ,ఐటీ, లా అండ్ ఆర్డర్, ఆధార్‌లతో పాటు 18 విభాగాలకు చెందిన అధికారులు సంతోష్‌ను పలు కోణాల్లో విచారించారు. రిజిస్టేషన్ శాఖ పరిధిలోని సాంకేతిక లోపాన్ని ఆసరాగా చేసుకొని నకిలీ వేలిముద్రలను తయారు చేసినట్టు అధికారులకు వెల్లడించారు. ఇలా తయారుచేసిన వేలిముద్రలను ఆధార్ డేటా బేస్ నుండి కేవైసీ అప్రూవల్ పొందడానికి వినియోగించినట్టు వాంగ్మూలం ఇచ్చారు.

మొత్తం 14 వందల డాక్యమెంట్లను డౌన్‌లోడ్ చేసినట్టు అధికారులకు వెల్లడించిన సంతోష్‌ గత 8 నెలల్లో వీటి ఆధారంగానే ఆరు వేల సిమ్‌లను యాక్టివేట్ చేసినట్టు వివరించాడు. కేవలం కమిషన్ల కోసమే ఇదంతా చేసినట్లు సంతోష్ తొలిరోజు విచారణలో వెల్లడించాడు. అయితే ఆధార్ చట్టబద్ధత, గోప్యతపై చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ వ్యవహారాన్ని కేంద్ర నేర పరిశోధనా రంగాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories