సత్తాచాటిన తెలుగు విద్యార్థులు

సత్తాచాటిన తెలుగు విద్యార్థులు
x
Highlights

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ 2018 పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్...

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ 2018 పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)లో ఢిల్లీకి చెందిన కల్పనా కుమారి టాపర్‌గా నిలిచింది. కాగా ఈ ఫలితాలలో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో తెలంగాణ విద్యార్థి రోహన్‌ పురోహిత్‌ 690 మార్కులతో రెండో ర్యాంకు, వరుణ్‌ ముప్పిడి 685 మార్కులతో 6వ ర్యాంకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంకడాల అనిరుధ్‌బాబు 680 మార్కు లతో 8వ ర్యాంకు సాధించారు. ఇదిలావుంటే ఈ పరీక్షకోసం దేశవ్యాప్తంగా 13.36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 12,69,922 మంది పరీక్ష రాయనివారు పోను 7,14,562 మంది ఉత్తీర్ణత సాధించారు. పాసైన వారిలో 3,12,399 మంది బాలురు, 4,02,162 మంది బాలికలు, ఒక ట్రాన్స్‌జెండర్‌ ఉన్నారు. ఉత్తీర్ణుల్లో తెలుగు రాష్ట్రాల చెందిన వారు 66,044 మంది ఉండటం గర్వకారణం.

Show Full Article
Print Article
Next Story
More Stories