Top
logo

నీట్‌-2018 ఫలితాలు విడుదల

నీట్‌-2018 ఫలితాలు విడుదల
X
Highlights

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌(నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌...

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌(నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌) 2018 పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం (జూన్ 5)న ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా, దానికి ఒకరోజు ముందుగానే ఈ రోజు మధ్యాహ్నం సీబీఎస్‌ఈ బోర్డు ఫలితాలను వెల్లడించింది. ఫలితాల కోసం cbseneet.nic.in, cbseresults.nic.inను క్లిక్‌ చేయవచ్చు. నీట్‌ ఫలితాలను వాయిదా వేయాలంటూ, స్టే ఇవ్వాల్సిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఒకరోజు ముందుగానే సీబీఎస్‌ఈ నీట్‌ ఫలితాలను వెల్లడించింది. ఈ రోజు వెల్లడైన నీట్‌ ఫలితాల్లో కల్పనా కుమారి నీట్‌ ఆలిండియా టాపర్‌గా నిలిచారు. 720 మార్కులకు గానూ 690 మార్కులు పొందిన కల్పనా కుమారి 99.99 శాతంతో ఫస్ట్‌ర్యాంకు సాధించారు.

Next Story