బీజేపీలో పదవి.. వైసీపీలో పైరవీలు...

బీజేపీలో పదవి.. వైసీపీలో పైరవీలు...
x
Highlights

బిజేపీ నేతలతో అంటకాగుతుంటారు ఆ పార్టీ పదవిని స్వీకరిస్తారు అధినాయకులతో టచ్ లో ఉంటారు అవసరమైన సలహాలూ తీసుకుంటారు అంతలోనే మరో పార్టీ నేతలతో మంతనాలు...

బిజేపీ నేతలతో అంటకాగుతుంటారు ఆ పార్టీ పదవిని స్వీకరిస్తారు అధినాయకులతో టచ్ లో ఉంటారు అవసరమైన సలహాలూ తీసుకుంటారు అంతలోనే మరో పార్టీ నేతలతో మంతనాలు జరుపుతారు తాను అందరివాడు అన్నట్లుగా అన్నిపార్టీల నేతలతో సయోధ్యగా మెలుగుతారు నెల్లూరులో గత రెండు రోజులుగా హాట్ టాఫిక్ గామారిన ఆ నాయకుడి పయనమెటు..? అంతుచిక్కని అంతరంగంతో హాట్ హాట్ గా మారిన ఆ నాయకుడెవ్వరు..?

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఆయనది బలమైన నేపధ్యం రాజకీయాల్లో కాకలు తీరిన సామాజిక వర్గం కావడంతో ఆయనను పదవులు వరించాయి. ఆయనే మాజీ ముఖ్యమంత్రి నేదురు మల్లి జనార్ధన్ రెడ్డి ఆయనకు అనేక విద్యాసంస్థలు కూడా ఉండేవి నేదురు మల్లి జనార్ధన్ రెడ్డి తర్వాత ఆయన భార్య నేదురుమల్లి రాజ్యలక్ష్మి వైఎస్ కేబినెట్ లో మంత్రి పదవి కూడా పొందారు. అలా రాజకీయాలను శాసించిన ఆ కుటుంబం నేదురు మల్లి మరణానంతరం అయోమయంలో పడిపోయింది. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి జనార్దన్ రెడ్డి తనయుడు ఎన్ బీకేఆర్ విద్యాసంస్థలకు అధిపతి కూడా ప్రస్తుతం రామ్ కుమార్ రెడ్డి నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గామారారు బేసిక్ గా కాంగ్రెస్ వాదులైన నేదురు మల్లి కుటుంబం విభజనానంతరం కాంగ్రెస్ రాజకీయాలకు దూరమైపోయింది. తండ్రి మరణానంతరం ప్రస్తుత ఉపరాష్టపతి వెంకయ్యనాయుడుకి అనుచరుడుగా మారిపోయారు ఆ అనుబంధంతో బిజేపీ వైపు అడుగులు వేశారు ఇటీవల బిజేపీ ఆయనకు ఏపీ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టింది.

సీన్ కట్ చేస్తే... బిజేపీ రాష్ట కార్యదర్శిగా నియమితులైన కొన్ని గంటల్లోనే రామ్ కుమార్ రెడ్డి రూట్ మార్చేశారు.. తమకు ఆది నుంచి ఆప్తులుగా చెప్పుకునే వైసీపీ అధినేత వద్దకు వెళ్లారు.. దాదాపు 20 నిమిషాలు జగన్ తో ఏకాంతంగా చర్చించారు.. రాజకీయ వ్యూహరచనకు తెరలేపారు. ఇది ఇప్పుడు ఇటు నెల్లూరే కాదు.. రాష్ట రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది.. బిజేపీ జాతీయ నేతల అనుబంధంతో అక్కడ పదవి పొంది ఇక్కడ ప్రతిపక్ష నేత జగన్ పంచన చేరడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరచర్చకు తెరలేచింది..

వాయస్ : గంటల వ్యవధిలో అటు ఇటుగా అధినాయకులతో సమావేశమైన రామ్ కుమార్ రెడ్డి అంతరంగమేంటి అన్నదే ఇప్పుడు నెల్లూరులో హాట్ టాపిక్ ఆయన వైసీపీలోకి వెళ్తారా..? లేదా పదవినిచ్చిన కమలం పార్టీలో కుదురుగా ఉంటారా అన్నదే ఆ చర్చ.. నేదురుమల్లి కుటుంబానికి రాజకీయ భిక్షతో పాటు పురోగతికి కేంద్ర బిందువైన వెంకటగిరి నియోజకవర్గం నుంచే రామ్ కుమార్ రెడ్డి పోటీ చేయాలన్నది చాలా రోజులుగా జరుగుతున్న చర్చ గత 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్దిగా పోటీ చేసినా పోలింగ్ కు వారం ముందు రామ్ కుమార్ రెడ్డి పోటీ నుంచి సైడయ్యారు అభ్యర్దిగా ఉన్న అనుచరులకు మాత్రం రూట్ మార్చే సందేశాలిచ్చేశారు ఆరంభంలోనే రామ్ కుమార్ రెడ్డి తీసుకున్న ఆ నిర్ణయం అనుచరవర్గంతో పాటు రాజకీయవర్గాల్లోనూ పెద్ద విమర్శలకు దారితీసింది.

తాజాగా రామ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్న పొలిటికల్ డబుల్ స్టాండ్ ఇప్పుడు ఆయన అనుచరుల్లోనే కాదు అటు బిజేపీ, ఇటు వైసీపీలోనూ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఇంతకీ రామ్ కుమార్ రెడ్డి తండ్రి తరహా రాజకీయ వ్యూహాలను అనుసరిస్తున్నారా లేక తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారా అన్నది సింహపురిలో జరుగుతున్న తాజా చర్చ బిజేపీ నుంచి పదవి పొందిన రామ్ కుమార్ పార్టీకి రామ్ రామ్ చెప్పి జగన్ పార్టీలో చేరతారా అన్నది జిల్లాలో జోరుగా జరుగుతున్న ప్రచారం బహుశా ఆయన ఆనంతో అటు, ఇటుగా వైసీపీ తీర్దం పుచ్చుకుంటారు అనేది ఆయన అనుచరులు చెబుతున్న మాట ఏదేమైనప్పటికీ ఆరంభ రాజకీయాల్లోనే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అటో అడుగు, ఇటో అడుగు వేయడం రాజకీయంగా విమర్శలకు దారి తీస్తోంది ఇంతకీ ఆయన చివరి స్టాండ్ ఏందో అన్నది ఉత్కంఠను రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories