logo
సినిమా

న‌య‌న్‌..నెగటివ్ ట‌చ్‌

న‌య‌న్‌..నెగటివ్ ట‌చ్‌
X
Highlights

ద‌క్షిణాదిన అన్ని భాష‌ల్లోనూ స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది కేర‌ళ కుట్టి న‌య‌న‌తార‌. ప్ర‌స్తుతం ఈ...

ద‌క్షిణాదిన అన్ని భాష‌ల్లోనూ స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది కేర‌ళ కుట్టి న‌య‌న‌తార‌. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ రూ.3 కోట్ల‌కి పైగా రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటోంది. ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న 'సైరా న‌ర‌సింహారెడ్డి'లో న‌య‌న‌తార ఓ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ సినిమాలో ఆమెది న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌ని.. ఆ పాత్ర‌లో కాస్త నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

తమిళంలో చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్న న‌య‌న‌తార‌.. గ‌త కొంత‌కాలంగా తెలుగులో సినిమాలు త‌గ్గించేసింది. పాత్ర మ‌రీ న‌చ్చితే త‌ప్ప సినిమాలు ఒప్పుకోవ‌డం లేదు.'సైరా' విష‌యంలోనూ అదే జ‌రిగింద‌నుకోవాలి. అన్న‌ట్టు.. 'సైరా'తో పాటు బాల‌కృష్ణ 102వ చిత్రంలోనూ న‌య‌న నాయిక‌గా న‌టిస్తోంది. ఇందులోనూ ఆమెది పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర‌ని చిత్ర‌బృందం తెలుపుతోంది.

Next Story