Top
logo

మాజీ ప్రధాని భార్య కన్నుమూత.. జైల్లో భర్త, కూతురు

మాజీ ప్రధాని భార్య కన్నుమూత.. జైల్లో భర్త, కూతురు
X
Highlights

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య కుల్సుమ్ నవాజ్(68) కన్నుమూశారు. గతకొంతకాలంగా క్యాన్సర్‌తో...

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య కుల్సుమ్ నవాజ్(68) కన్నుమూశారు. గతకొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె లండన్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సోమవారం కుల్సుమ్‌ ఆరోగ్యం క్షీణించడంతో కృత్రిమ శ్వాసను అందించారు. ఊపరితిత్తుల సమస్య కూడా తలెత్తడంతో చివరకు హ్యార్లీ స్ట్రీట్ ఆసుపత్రిలో మంగళవారం కన్నుమూశారు. పాక్ సాధారణ ఎన్నికల ముందు భార్య కుల్సుమ్ ను లండన్ ఆసుపత్రిలో కలిశారు నవాజ్ షరీఫ్. అనంతరం పాకిస్థాన్ కు తిరిగి వస్తుండగా నవాజ్ షరీఫ్, కుమర్తె మర్యమ్‌లు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం వారు పాక్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు.

Next Story