logo
జాతీయం

నేవీ కమాండర్‌ పైత్యం.. భార్య ఫోటోలను..

నేవీ కమాండర్‌ పైత్యం.. భార్య ఫోటోలను..
X
Highlights

భార్య ఫొటోలనే నగ్నగా మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్ లో పెట్టాడో నేవీ కమాండర్. దాంతో భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు...

భార్య ఫొటోలనే నగ్నగా మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్ లో పెట్టాడో నేవీ కమాండర్. దాంతో భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో పనిచేస్తున్న సదరు నేవీ కమాండర్ పోర్నోగ్రఫీకి బానిసయ్యాడని అతడి భార్య పోలీసులు ఫిర్యాదు చేశారు. తన భర్త కొంతకాలంగా అశ్లీల వెబ్సైట్‌లకు అలవాటుపడి ఎంతకీ వాటిని వదిలేయకపోవడంతో తాను పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చేశానని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫోటోలనే కాక అతడి కొలీగ్‌ భార్య, మరికొందరు ఇతర మహిళల అభ్యంతరకర ఫోటోలను ఆ పోర్న్ సైట్లలో అప్‌లోడ్‌ చేశాడని తెలిపారు. అంతేకాదు నిందితుడికి తన కొలీగ్‌ భార్యతో వివాహేతర సంబంధం కూడా ఉందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. భర్త ప్రవర్తనను భరించలేకే గతంలో విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్టు ఆమె వెల్లడించారు.

Next Story