ముందస్తు ఎఫెక్ట్ : కాంగ్రెస్ లో చేరిన టీఆర్ఎస్ నేత

ముందస్తు ఎఫెక్ట్ : కాంగ్రెస్ లో చేరిన టీఆర్ఎస్ నేత
x
Highlights

రాష్ట్రంలో ఒకవైపు ముందస్తు ఎన్నికల వేడి రాజుకున్న తరుణంలో నేతలు ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎత్తులకు పైఎత్తులు...

రాష్ట్రంలో ఒకవైపు ముందస్తు ఎన్నికల వేడి రాజుకున్న తరుణంలో నేతలు ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన శివకుమార్ రెడ్డి.. తాజాగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాగా, గత ఎన్నికల్లో శివకుమార్ రెడ్డి నారాయణపేట నియోజకవర్గం నుంచి తన ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి అయిన రాజేందర్ రెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయితే మారిన రాజకీయ సమీకరణాల రీత్యా నారాయణపేటలో గెలిచిన రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అక్కడ ఇంఛార్జిగా ఉన్న శివకుమార్ రెడ్డి పరిస్థితి తారుమారైంది. ఈ నేపథ్యంలో అయన ఇవాళ కాంగ్రెస్ లో చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముందస్తు ఎన్నికలు జరుగుతాయని స్పష్టమైన సంకేతాలు రావడంతో నారాయణపేటలో బలమైన అభ్యర్థికోసం కాంగ్రెస్ వేట సాగించి ఆయనను పార్టీ చేర్చుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories