మంత్రి నారా లోకేష్ మళ్ళీ తడబాటు.. ఈసారి ఎన్టీఆర్..

మంత్రి నారా లోకేష్ మళ్ళీ తడబాటు.. ఈసారి ఎన్టీఆర్..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ యాదృచ్చికంగా అన్నారో కావాలనో అన్నారో కానీ తన తాత దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను ఉద్దేశించి తడబాటు వ్యాఖ్యలు చేశారు....

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ యాదృచ్చికంగా అన్నారో కావాలనో అన్నారో కానీ తన తాత దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను ఉద్దేశించి తడబాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిని చేసిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ అని అన్నారు.. సోమవారం కర్నూల్ జిల్లా బ్రాహ్మణకొట్కూరులో పర్యటించిన మంత్రి లోకేష్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. 'ఆనాడు ఫుల్‌ మెజార్టీ ఉన్నా అన్నగారిని దింపితే తెలుగు ప్రజలు గర్జించారని చెప్పారు. ఆ గర్జనను తట్టుకోలేక మళ్లీ మన అన్నగారిని ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఇందిరాగాంధీదే'నని పేర్కొన్నారు. ఇక వచ్చే ఎన్నికలో కర్నూల్ ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఖరారు చేశారు లోకేష్. కర్నూల్ అసెంబ్లీ స్థానానికి ఎస్వీ మోహన్ రెడ్డి, ఎంపీ స్థానానికి బుట్టా రేణుక పోటీ చేస్తారని ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories