లోకేష్ బాబు స్పందించారు.. అలా చేయనన్నారు

లోకేష్ బాబు స్పందించారు.. అలా చేయనన్నారు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేష్ పై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై.. ఇప్పుడు హాట్ హాట్ చర్చ నడుస్తోంది. ఈ...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేష్ పై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై.. ఇప్పుడు హాట్ హాట్ చర్చ నడుస్తోంది. ఈ విషయంపై.. లోకేష్ ఎలా స్పందిస్తారో చూడాలని అంతా అనుకున్న మాట కూడా వాస్తవం. అయితే.. లోకేష్ ఓ విషయంపై స్పందించారు కానీ.. పవన్ ఆరోపణలపై నేరుగా ఎలాంటి జవాబు ఇవ్వలేదు.

చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ జీవితంపై ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా.. లోకేష్ మాట్లాడుతూ చాలా విషయాలు గుర్తు చేసుకున్నారు. తనకు పధ్నాలుగేళ్ల వయసు వచ్చే వరకూ.. తండ్రితో ఎక్కువగా గడిపింది లేదని అన్నారు. తనతో కంటే.. ఎక్కువగా ప్రజలతోనే చంద్రబాబు సన్నిహితంగా ఉండేవారని అన్నారు. అర్థరాత్రి కూడా సమీక్షలు, సమావేశాలు, కార్యకర్తలతో భేటీలు నిర్వహిస్తూనే ఉంటారని.. 64 ఏళ్ల వయసులో కూడా 24 ఏళ్ల యువకుడిలా పని చేయడం బాబుకే చెల్లిందని చెప్పారు.

తనలాంటి వాళ్లకు చంద్రబాబును ఓ రోల్ మోడల్ గా లోకేష్ బాబు చెప్పారు. తనకు ఎంత పేరు వస్తుందో తెలియదన్న లోకేష్.. తండ్రి బాబుకు, తాత ఎన్టీఆర్ కు మాత్రం చెడ్డ పేరు తీసుకురానని.. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని సభలో చెప్పారు. అయితే.. ఈ మాటలన్నీ పవన్ ను ఉద్దేశించి లోకేష్ చేసినవేనా.. లేక సందర్భం కుదిరింది కాబట్టి అలా అన్నారా అన్నది మాత్రం జనం తేల్చుకోలేకపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories