ఎవరీ సుహాసిని... కూకట్‌పల్లిలో బాబు వ్యూహమేంటి?

ఎవరీ సుహాసిని... కూకట్‌పల్లిలో బాబు వ్యూహమేంటి?
x
Highlights

సుహాసిని. నందమూరి తారక రామారావు మనవరాలు. నందమూరి హరికృష్ణ పెద్ద కూతురు. జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ల అక్క. మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కోడలు....

సుహాసిని. నందమూరి తారక రామారావు మనవరాలు. నందమూరి హరికృష్ణ పెద్ద కూతురు. జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ల అక్క. మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కోడలు. నందమూరి కుటుంబానికి చెందిన సుహాసినిని కూకట్‌పల్లి నుంచి పోటీకి దింపడం వెనక చంద్రబాబుకు చాలా వ్యూహాలున్నాయి. అందులో ఒకటి, కూకట్‌పల్లిలో సీమాంధ్రులు ఎక్కువ. కూకట్‌పల్లిలో సెటిటర్లు భారీ సంఖ్యలో ఉన్నారు. మినీ ఆంధ్రాగా చెబుతారు. అందులోనూ కమ్మ సామాజికవర్గానికి చెందినవారే అధికంగా ఉన్నారు. దీంతో కూకట్‌పల్లిలో ముందు నుంచి తెలుగుదేశానికి పట్టుంది. 2014లోనూ టీడీపీ అభ్యర్థిగా మాధవరం కృష్ణారావు గెలిచారు. తర్వాత టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకుని, ఇప్పుడు అదే గులాబీ అభ్యర్థిగా రేసులో ఉన్నారు.

కూకట్‌పల్లిలో సీమాంధ్రులు ఎక్కువగా ఉండటం, ఎన్టీఆర్‌ అభిమానులూ అదేస్థాయిలో ఉండటం, హరికృష్ణ కూతురిగా సానుభూతి వెల్లువ, ఇలా అన్నీ అంశాలూ కలిసివస్తాయని లెక్కలేశారు చంద్రబాబు. వీటితోపాటే చాలా వ్యూహాలు చంద్రబాబు మదిలో ఉన్నాయి. నందమూరి వారసురాలిని బరిలోకి దింపడం ద్వారా, నారా ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి మధ్య ఎలాంటి పొరపొచ్చాలూ లేవని చెప్పదల్చుకున్నారు బాబు. హరికృష్ణ రూపంలో కుటుంబ పెద్ద అండ కోల్పోయిన, కల్యాణ్‌ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌ కుటుంబానికి నేనున్నానని భరోసా ఇవ్వడం. కల్యాణ్‌ రామ్, ఎన్టీఆర్‌లను తిరిగి టీడీపీలో క్రియాశీలకం చేయడం, తెలంగాణ ఎన్నికలతో పాటు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ నందమూరి హీరోలను క్యాంపెయిన్‌ స్టార్లుగా తిప్పడం వంటి వ్యూహాలు కూడా చంద్రబాబు మదిలో ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతారు.

సుహాసిని తరపున ప్రచారానికి నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్ వంటి వారు ప్రచారానికి రావడం ఖాయమని తెలుస్తోంది. దీంతో గ్రేటర్‌ ప్రచారంలో టీడీపీకి బూస్టింగ్‌ వస్తుందని భావిస్తున్నారు చంద్రబాబు. గ్రేటర్‌లోని అనేక స్థానాల్లో సీమాంధ్రులు తమవైపే ఉండేలా పునరుత్తేజం తేవొచ్చని లెక్కలేశారు... మొత్తానికి నందమూరి వారసురాలైన సుహాసినిని బరిలోకి దించడం చంద్రబాబు వ్యూహంలో భాగమని అర్థమవుతోంది. గ్రేటర్‌ టీడీపీకి ఇది పునరుత్తేజమని కార్యకర్తలు భావిస్తున్నారు. మరి కూకట్‌పల్లి నిజంగా టీడీపీ సొంతమవుతుందా....ఎన్టీఆర్‌ మనవరాలికి జనం పట్టం కడతారా....లేదంటే గులాబీ బాస్‌ తన రాజకీయ చాణక్యంతో కూకట్‌పల్లి ఫైట్‌ను టఫ్‌గా మార్చేస్తారా?

Show Full Article
Print Article
Next Story
More Stories