Top
logo

అభిమానులపై చేయి చేసుకున్న బాలకృష్ణ

అభిమానులపై చేయి చేసుకున్న బాలకృష్ణ
X
Highlights

సినీనటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చెంపదెబ్బల స్పెషలిస్ట్ గా మారిపోయారు. రీల్ లైఫ్‌లో అభిమానులే తన...

సినీనటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చెంపదెబ్బల స్పెషలిస్ట్ గా మారిపోయారు. రీల్ లైఫ్‌లో అభిమానులే తన దేవుళ్లు అంటూ స్పీచ్ లు ఇచ్చే బాలయ్య అభిమానంతో దగ్గరకు వస్తున్న ఫ్యాన్స్‌ను అక్కున చేర్చుకోవాల్సింది పోయి చెంప చెళ్లు మనిపించడం లేదా కాలుతో తన్నడం చేస్తూ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు.

అవేశాన్ని తట్టుకోలేకో లేక తన అభిమానులే కదా అనో తెలియదు కానీ ఎక్కడపడితే అక్కడ బాలయ్య అభిమానుల చెంపలు చెళ్లుమనిపిస్తున్నారు. దండెయ్యడానికొచ్చినా.. దండంపెట్టడానికొచ్చినా..సెల్ఫీ దిగేందుకు వచ్చినా బాలయ్యది ఒకటే రియాక్షన్ అదే తన చేతికి పని చెప్పడం. మళ్లీ అలాంటి రియాక్షనే బాలయ్య తెలంగాణ పర్యటలో జరిగింది. అభిమానంతో దగ్గరకు వచ్చిన అభిమానులపై తన ప్రతాపం చూపి వారి ఆగ్రహానికి గురయ్యారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బాలకృష్ణ ఖమ్మం జిల్లా తల్లాడ నుంచి మిట్టపల్లి వెళ్లారు. అక్కడ అభిమానులు బాలకృష్ణ కాన్వాయ్‌కు అడ్డుతగిలారు. ఆగ్రహంతో ఊగిపోయిన బాలయ్య.. వ్యాన్‌పై నుంచి దిగి షేక్‌ లాలు, రమేష్, కృష్ణయ్యలను కాలితో తన్నారు. అనంతరం కల్లూరు వెళ్లారు. బాలయ్య వైఖరిపై అభిమానులు నిరసన వ్యక్తం చేస్తూ.. టీడీపీ ఫ్లెక్సీలు, జెండాలు తగులబెట్టారు.

Next Story